Share News

శ్రీకాకుళం నుంచి తిరుపతికి రైలు

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:25 AM

సిక్కోలువాసుల చిరకాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరింది. జిల్లా నుంచి ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుపతికి మొట్ట మొదటి డైరెక్ట్‌ రైలు అందుబాటులోకి రానుంది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చేసిన నిరంతర కృషి ఫలించి ఈ నూతన సర్వీసుకు రైల్వేశాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

శ్రీకాకుళం నుంచి తిరుపతికి రైలు
హమ్‌సఫర్‌

13 నుంచి హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ పరుగులు

రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు

కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

అరసవల్లి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): సిక్కోలువాసుల చిరకాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరింది. జిల్లా నుంచి ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుపతికి మొట్ట మొదటి డైరెక్ట్‌ రైలు అందుబాటులోకి రానుంది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చేసిన నిరంతర కృషి ఫలించి ఈ నూతన సర్వీసుకు రైల్వేశాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు రైల్వేశాఖ 17439/40 హమ్‌ సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 13వ తేదీ నుంచి ప్రారం భిస్తున్నట్లు రైల్వేబోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రతీ సోమవారం శ్రీకాకుళం నుంచి..

ఈ నూతన రైలు ఏప్రిల్‌ 13న శ్రీకాకుళం రోడ్డు రైల్వేస్టేషన్‌ నుంచి లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇది ప్రతీ ఆదివారం సాయంత్రం తిరుపతి నుంచి బయ లుదేరుతుంది. అలాగే ప్రతీ సోమవారం మధ్యాహ్నం నుంచి శ్రీకాకుళం రోడ్‌ నుంచి తిరుపతికి వెళుతుంది. నూతన సర్వీసు రానున్న నేపథ్యంలో తిరు మలకు వెళ్లే భక్తులకు కొంతమేర ఇబ్బందులు తొలగనున్నా యి. ఇప్పటి వరకు భువ నేశ్వర్‌ నుంచి వచ్చే రైళ్ల పైనే ఆధార పడాల్సి వచ్చేది. తగినన్ని బెర్తులు దొరక్క, విశాఖ పట్నం మీదుగా ప్రయాణించే టప్పుడు తీవ్ర రద్దీతో భక్తులు ఇబ్బందులు పడేవారు. ఈ డైరెక్ట్‌ రైలుతో జిల్లా వాసులకు ఎక్కువ బెర్తులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో తిరుమల ప్రయాణం మరింత సౌకర్యవంతం కానుంది.

మరిన్ని సర్వీసులు తీసుకువస్తాం

రామ్మోహన్‌ నాయుడు

తాను ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచే శ్రీకాకుళం నుంచి తిరుపతికి డైరెక్ట్‌ రైలు సాధన లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఇందుకోసం రైల్వేమంత్రులు, బోర్డు అధికారులు, డీఆర్‌ఎంలతో పలుమార్లు చర్చిం చామన్నారు. ఈ నేపథ్యంలో హమ్‌సఫర్‌ రైలును మంజూరు చేసి కల సాకారం చేసిన రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌కు జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. రానున్న రోజుల్లో జిల్లాకు మరిన్ని నూతన రైలు సర్వీసులు తీసుకువచ్చి, రైల్వే పరంగా శ్రీకాకుళాన్ని ప్రగతిపథంలో నడిపిస్తానని మంత్రి స్పష్టం చేశారు.

Updated Date - Apr 09 , 2026 | 12:25 AM