‘మార్గదర్శి దుర్గాభాయి దేశ్‌ముఖ్’
ABN , Publish Date - Sep 05 , 2026 | 11:49 PM
మహిళాభ్యున్నతికి విశేష కృషి చేసిన దుర్గా భాయి దేశ్‌ముఖ్ మార్గదర్శి అని మాజీ మంత్రి, మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ త్రిపురాన వెంకట రత్నం అన్నారు. స్వాతం త్య్ర సమరయోధురాలు దుర్గా భాయి దేశ్‌ముఖ్ విగ్రహాన్ని శాంతినగర్ కాలనీలోని సంఘ సంస్కర్తల స్మృతి వనంలో శనివారం ఆవిష్కరించారు.
పాత శ్రీకాకుళం సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): మహిళాభ్యున్నతికి విశేష కృషి చేసిన దుర్గా భాయి దేశ్‌ముఖ్ మార్గదర్శి అని మాజీ మంత్రి, మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ త్రిపురాన వెంకట రత్నం అన్నారు. స్వాతం త్య్ర సమరయోధురాలు దుర్గా భాయి దేశ్‌ముఖ్ విగ్రహాన్ని శాంతినగర్ కాలనీలోని సంఘ సంస్కర్తల స్మృతి వనంలో శనివారం ఆవిష్కరించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో శ్రీకా కుళం జిల్లా నుంచి చేరి పోరాటం చేసి దేశ సేవ లో పాల్గొన్న లాలిశెట్టి అప్పారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనం తరం మాజీ రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యా య అవార్డు గ్రహీత చౌదరి రాధాకృష్ణ, విగ్రహ దాతలను గాంధీ మందిర ప్రతినిధులు సత్కరిం చారు. కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి నారాయణరావు, వంశధార ఏఈ శివాజీ, మందిరం ప్రతినిధులు నిష్ఠల నరసింహమూర్తి, మహీబుల్లాఖాన్, నక్క శంకర రావు, గుత్తు చిన్నారావు, జామి భీమశంకర్, ఎంవీవీఎస్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
అల్లూరి విగ్రహావిష్కరణ
వజ్రపుకొత్తూరు, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): కంబారాయుడి ప్రాథమిక పాఠశాల ఆవరణలో శనివారం సీమెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏడు అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్ర హాన్ని ఆవిష్కరించారు. అల్లూరి పోరాట స్ఫూర్తి ని యువత ఆదర్శంగా తీసుకొని ఉన్నత లక్ష్యా లు సాధించాలనే ఉద్దేశంతో అల్లూరి విగ్రహా న్ని ఏర్పాటు చేసినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎం ఎల్.కరు ణాకర్, పలువురు ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.