Share News

పండుగ పూట విషాదం

ABN , Publish Date - Jan 19 , 2026 | 12:04 AM

సంక్రాంతికి అత్తవారింటికి వచ్చిన ఇద్దరి అల్లుళ్లకు సంబంధించిన వా హనాలు ఢీకొన్నాయి. ఓ వ్యక్తి మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. దీంతో పండుగపూట అత్తవారింట విషా దం నెలకొంది.

 పండుగ పూట విషాదం
రాజశేఖర్‌ (ఫైల్‌) :

సంతబొమ్మాళి, జనవరి18(ఆంధ్రజ్యోతి): సంక్రాంతికి అత్తవారింటికి వచ్చిన ఇద్దరి అల్లుళ్లకు సంబంధించిన వా హనాలు ఢీకొన్నాయి. ఓ వ్యక్తి మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. దీంతో పండుగపూట అత్తవారింట విషా దం నెలకొంది. నౌపడ ఎస్‌ఐ నారాయణస్వామి కథనం మేరకు.. గార మండలంలోని శిలగాంకు చెందిన సీమన్‌ నీలాపు రాజశేఖర్‌ టెక్కలి మండలంలోని పెద్దరోకళ్లపల్లికి, వజ్రపుకొత్తూరు మండలంలోని కొత్తపేటకు చెందిన బ్యాంక్‌లో క్యాషి యర్‌ ఉత్తరాల సంతోష్‌ మండలంలోని యామలపేటకు అత్తవారిళ్లకు సంక్రాంతికి వచ్చారు. పండుగను సరదాగా గడిపిన నీలాపు రాజశేఖర్‌ బుల్లెట్‌పై నౌపడకు,ఉత్తరాల సంతోష్‌ స్కూటీపై తన కుమార్తె బర్త్‌సర్టిఫి కెట్‌కోసం టెక్కలి శనివారం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రాత్రి నౌపడ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో వారి రెండుద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి.దీంతో నీలాపు రాజశేఖర్‌(32)మృతిచెందాడు.ఉత్తరాల సంతో ష్‌కు తలపై తీవ్రమైన గాయాలు కావడంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాజశేఖర్‌కు భార్యతో పాటు రెండేళ్ల కుమారుడు ఉన్నారు. అప్పటివరకు సందడిగా ఉన్న అత్తవారి ఇళ్లల్లో విషాదం నెలకొంది.సరదాగా గడపాల్సిన ఈ సమయంలో ఇటువంటి సంఘటన జరగడంతో కన్నీరుమున్నీరుగా రోదస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించారు.

Updated Date - Jan 19 , 2026 | 12:04 AM