పెళ్లింట్లో విషాదం
ABN , Publish Date - May 08 , 2026 | 12:47 AM
నగరంలోని పీఎన్ కాలనీలో బంధువుల వివాహ వేడుకల్లో పాల్గొ నేందుకు వచ్చిన ఉపాధ్యాయుడు నానుపాత్రుని భుజంగరావు (61) లిఫ్ట్ నుంచి జారిపడి మృతి చెందారు.
లిఫ్ట్ నుంచి జారిపడి వ్యక్తి మృతి
శ్రీకాకుళం క్రైం, మే 7(ఆంధ్రజ్యోతి): నగరంలోని పీఎన్ కాలనీలో బంధువుల వివాహ వేడుకల్లో పాల్గొ నేందుకు వచ్చిన ఉపాధ్యాయుడు నానుపాత్రుని భుజంగరావు (61) లిఫ్ట్ నుంచి జారిపడి మృతి చెందారు. గురువారం ఉదయం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన భుజంగరావు గురువారం పీఎన్ కాలనీలోని 9వ లైన్‌లో నివాసం ఉంటున్న సోదరుని ఇంట్లో వివాహానికి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. డీసీసీబీ కాలనీలో ఉంటున్న వెంకట కృష్ణారావు ఇంటి నుంచి గురువారం ఉదయం పీఎన్ కాలనీలోని అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. నాలుగో అంతస్తులో ఉన్న సోదరుని ఇంటికి చేరుకున్నాడు. టిఫిన్ చేసిన తర్వాత కిందకు దిగేందుకు భుజంగరావు లిప్ట్ వద్దకు చేరుకొని బటన్ నొక్కగానే తలుపులు తెరుచుకున్నాయి. లిప్ట్ యథాస్థితిలో ఉందని భావించిన ఆయన చూసు కోకుండా లోపలికి ప్రవేశించడంతో కిందకు పడిపోయా డు. వెంటనే అక్కడున్న వాచ్‌మెన్, కుటుంబ సభ్యులు రిమ్స్‌కు తరలించారు. అప్పటికే అతను మృతి చెంది నట్టు వైద్యులు నిర్ధారించారు. భుజంగరావు కుమారుడు మహేష్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ ఎస్‌ఐ చంద్రకళ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.