Share News

నామినేషన్ల నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్‌ మళ్లింపు

ABN , Publish Date - Oct 21 , 2026 | 11:56 PM

శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ జరుగుతున్న నేప థ్యంలో ట్రాఫిక్‌ నియంత్రణ, ప్రజల సౌకర్యార్థం బుధవారం నుంచి 23వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పట్టణంలో ట్రాఫిక్‌ మళ్లింపు చేపట్టినట్లు శ్రీకాకుళం టౌన్‌ డీఎస్పీ ధనుంజయనాయుడు తెలిపారు.

నామినేషన్ల నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్‌ మళ్లింపు
రోడ్డుపై బారికేడ్లు పెట్టి ట్రాఫిక్‌పై సూచనలిస్తున్న పోలీసు సిబ్బంది

డీఎస్పీ ధనుంజయనాయుడు

శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ జరుగుతున్న నేప థ్యంలో ట్రాఫిక్‌ నియంత్రణ, ప్రజల సౌకర్యార్థం బుధవారం నుంచి 23వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పట్టణంలో ట్రాఫిక్‌ మళ్లింపు చేపట్టినట్లు శ్రీకాకుళం టౌన్‌ డీఎస్పీ ధనుంజయనాయుడు తెలిపారు.

ట్రాఫిక్‌ మళ్లింపు మార్గాలివే..

పొట్టి శ్రీరాములు జంక్షన్‌ నుంచి జడ్పీ వైపు వచ్చే వాహనాలు అరస వల్లి మిల్లు జంక్షన్‌ నుంచి 80 అడుగుల రోడ్డు, పొన్నాడ వంతెన వైపు నుంచి పాత శ్రీకాకుళం సంతోషిమాత గుడి జంక్షన్‌ మీదుగా తమ గమ్య స్థానాలకు చేరాలన్నారు. అలాగే ఏపీహెచ్‌బీ కాలనీ, పాత శ్రీకాకుళం సంతోషిమాత గుడి వైపు నుంచి వచ్చే వాహనదారులు పొన్నాడ జంక్షన్‌ నుంచి వాంబేకాలనీ మీదుగా 80 అడుగుల రోడ్డు, అరసవల్లి మిల్లు జంక్షన్‌ వైపు వెళ్లాలని సూచించారు.

అభ్యర్థులకు సూచనలిలా..

పొట్టి శ్రీరాములు జంక్షన్‌ వైపు నుంచి వచ్చే నామినేషన్‌ వేసే అభ్యర్థులు గూనపాలెం చెరువు గట్టు వద్ద ఏర్పాటు చేసిన వంద మీటర్ల కటాఫ్‌ పాయింట్‌ వద్ద వాహనాలు దిగి అభ్యర్థితో పాటు ఇద్దరు సహాయ కులు మాత్రమే జడ్పీ కార్యాలయం వద్ద నామినేషన్‌ కేంద్రానికి కాలి నడకన వెళ్లాలన్నారు. పొన్నాడ జంక్షన్‌ వైపు నుంచి వచ్చే అభ్యర్థులు నలందా రోడ్డు జంక్షన్‌ వద్ద వాహనాలు నుంచి దిగి నామినేషన్‌ కేంద్రానికి వెళ్లాలని సూచించారు. ప్రజలు, వాహనదారులు నామినేషన్‌ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులు పోలీసు సూచనలు పాటించి ట్రాఫిక్‌ నియం త్రణకు సహకరించాలని కోరారు.

Updated Date - Oct 21 , 2026 | 11:56 PM