Share News

సంప్రదాయాలను పాటించాలి

ABN , Publish Date - Jul 05 , 2026 | 11:58 PM

సంస్కృతి, సంప్ర దాయాలను పాటించాలని నిర్వాహకులను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. ఆదివారంజంట పట్టణాల్లో ఆర్టీసీకాంప్లెక్స్‌ వద్ద ఆటో కార్మికుల ఆధ్వర్యంలో కాటమ్మతల్లి అమ్మవారి వార్షిక సంబ రాలు నిర్వహించారు.

 సంప్రదాయాలను పాటించాలి
కాటమ్మతల్లి అమ్మవారి జంగెడను తలపై పెట్టుకొని ఊరేగిస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష:

పలాస, జూలై 5(ఆంధ్ర జ్యోతి): సంస్కృతి, సంప్ర దాయాలను పాటించాలని నిర్వాహకులను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. ఆదివారంజంట పట్టణాల్లో ఆర్టీసీకాంప్లెక్స్‌ వద్ద ఆటో కార్మికుల ఆధ్వర్యంలో కాటమ్మతల్లి అమ్మవారి వార్షిక సంబ రాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతు శిరీష కాటమ్మతల్లి అమ్మవారి జంగెడును తలపై పెట్టుకొని ఊరేగింపుగా వెళ్లారు. తొలుత అమ్మవారి ఉత్సవమూర్తులను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాలు సంవృద్ధిగా కురవాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో తలతూగాలని మొక్కుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వజ్జ బాబూరావు, లొడగల కామేశ్వర రావుయాదవ్‌, పీరుకట్ల విఠల్‌రావు, గాలి కృష్ణారావు, గురిటి సూర్యనారాయణ, మల్లా శ్రీనివాసరావు, అంబటి కృష్ణమూర్తి, కొరికాన శంకర్‌, గోపి పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 11:58 PM