ట్రాక్టర్ దొంగ అరెస్టు
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:30 AM
తమిళనా డు రాష్ట్రానికి చెందిన ట్రాక్టర్ దొంగ అన్నాతురై అనే వ్యక్తిని అరెస్టు చేసి మంగళవారం పలాస కోర్టులో హాజరుపరిచిన ట్టు కాశీబుగ్గ సీఐ వై.రా మకృష్ణ తెలిపారు.
పలాస, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): తమిళనా డు రాష్ట్రానికి చెందిన ట్రాక్టర్ దొంగ అన్నాతురై అనే వ్యక్తిని అరెస్టు చేసి మంగళవారం పలాస కోర్టులో హాజరుపరిచిన ట్టు కాశీబుగ్గ సీఐ వై.రా మకృష్ణ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. పలాస-కాశీబుగ్గ మున్సి పాలిటి పరిధిలో ఉన్న మొగిలిపాడు గ్రామానికి చెందిన బుడత జగదీష్ ఈ నెల 23న జాతీయరహదారి బైపాస్ రోడ్డులో తన షాపు వద్ద ట్రాక్టర్ పార్కిం గ్ చేశాడు. తిరిగి శుక్రవారం తెల్లవారి చూసే సరికి ట్రాక్టర్ కనిపించలేదు. 24వ తేదీన కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి అన్నాతురైను గుర్తించి మంగళవారం అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.