కండికపేటలో ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
ABN , Publish Date - May 18 , 2026 | 12:02 AM
మండల పరిధి పెద్దసాన పంచాయతీ కండికపేట వద్ద ఆదివారం టాక్టర్ బోల్తాపడి బుడితి ఆనందరావు(56) మృతి చెందాడు.
టెక్కలి, మే 17(ఆంధ్రజ్యోతి): మండల పరిధి పెద్దసాన పంచాయతీ కండికపేట వద్ద ఆదివారం టాక్టర్ బోల్తాపడి బుడితి ఆనందరావు(56) మృతి చెందాడు. పొలం దున్నేందుకు ట్రాక్టర్‌తో వెళ్తుండగా ప్రమాద వశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆనందరావును కు టుంబ సభ్యులు చికిత్స కోసం టెక్కలి జిల్లా ఆసుపత్రికు తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారిం చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి మృతి
పొందూరు, మే 17(ఆంధ్రజ్యోతి): కొద్దినెలలుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ ఆత్మహ త్యాయత్నానికి పాల్పడిన వడగా గౌతమ్(22) చికి త్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పోలీ సులు తెలిపిన వివరాల మేరకు.. తండ్యాం పంచాయతీ ఎస్‌ఆర్ నగర్ కాలనీకి చెందిన వడగా గౌతమ్ కిడ్నీ సమస్య తీవ్రంకావడంతో ఈ నెల 7న గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డా డు. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం శ్రీకాకు ళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. గౌతమ్ తల్లి చంద్రకళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు.
రైలు ఢీకొని వృద్ధుడు..
పొందూరు, మే 17(ఆంధ్రజ్యోతి): దూసి రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో గోకర్ణపల్లి గ్రామానికి చెందిన కిల్లి అప్పలనాయుడు (55) శనివారం రాత్రి మృతి చెందాడు. రైల్వేపోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శనివారం రాత్రి బహిర్భూమికి వెళతానని ఇంటిలో చెప్పి బయటకు వెళ్లిన అప్పలనాయుడు ఎంతకీ రాకపోవడంతో అతని కోసం కుటుంబసభ్యులు వెతికారు. ఆదివారం రైలుపట్టాలపై ఉన్న మృతదేహాన్ని గుర్తించిన రైల్వే పోలీసు లు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. కాగా అలప్పలనాయుడికి భార్య వనజ, కుమార్తె ఉన్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.