Share News

విమానాశ్రయంతో అభివృద్ధి దిశగా..

ABN , Publish Date - Jul 31 , 2026 | 12:33 AM

Pension distribution two days early ‘భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి నూతన అధ్యాయం కానుంద’ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గురువారం కోటబొమ్మాళి మండలం కన్నేవలసలో ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద లబ్ధిదారులకు సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు.

విమానాశ్రయంతో అభివృద్ధి దిశగా..
కన్నేవలసలో వృద్ధురాలికి పింఛన్‌ అందజేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

రెండు రోజుల ముందే పింఛన్ల పంపిణీ

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, జూలై 30(ఆంధ్రజ్యోతి): ‘భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి నూతన అధ్యాయం కానుంద’ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గురువారం కోటబొమ్మాళి మండలం కన్నేవలసలో ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద లబ్ధిదారులకు సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి.. యోగక్షేమాలను తెలుసుకున్నారు. అలాగే ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంలో భాగంగా కూటమి పాలనలో రెండేళ్లలో అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. పలుచోట్ల రహదారులు, అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘ఆగస్టు 1న ప్రధానమంత్రి చేతుల మీదుగా భోగాపురం విమానశ్రయం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం రెండు రోజులు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ చేపట్టింది. ఉత్తరాంధ్ర అభివృద్దికి భోగాపురం విమానాశ్రయం మైలురాయిగా నిలుస్తుంది. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగి యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. వైసీపీ పాలనలో అక్రమాలకు పెద్దపీట వేసి.. గ్రామాల అభివృద్ధిని, ప్రజాసంక్షేమాన్ని విస్మరించారు. ప్రస్తుత కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా ముందుకెళ్తోంద’ని తెలిపారు. త్వరలో ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందిస్తామన్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, టెక్కలి ఆర్డీవో ఎం. కృష్ణమూర్తి, అర్‌అంబ్‌బీ ఇంజనీరింగ్‌ అధికారి ఎం. సుధాకర్‌రావు, టీడీపీ నాయకులు బోయిన రమేష్‌, తర్ర రామకృష్ణ, వెలమల విజయలక్ష్మి,. కామేశ్వరరావు, పూజారి శైలజ, కర్రి అప్పారావు, బోయిన సత్యశ్రీనివాస్‌, రావాడ రాజేష్‌కుమార్‌, ఎంపీడీవో కె.నారాయణరావు, తహసీల్దార్‌ చింతపూడి ప్రసాదరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2026 | 12:33 AM