Share News

పార్కింగ్‌ స్థలం లేక.. పర్యాటకుల అగచాట్లు

ABN , Publish Date - Aug 03 , 2026 | 12:07 AM

శివసాగర్‌ తీరంలో రోడ్డుపైనే వాహనాల పార్కింగ్‌ కు స్థలం లేకపోవ డంతో నిత్యం ట్రా ఫిక్‌ సమస్య వెంటా డుతోంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో వాహనాలపై జిల్లా లోని పలు ప్రాంతా ల నుంచి సేదదీరడా నికి వస్తుంటారు.

పార్కింగ్‌ స్థలం లేక.. పర్యాటకుల అగచాట్లు
శివసాగర్‌ తీరం రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్‌ చేసిన పర్యాటకులు

వజ్రపుకొత్తూరు, ఆగస్టు 2 (ఆంధ్ర జ్యోతి): శివసాగర్‌ తీరంలో రోడ్డుపైనే వాహనాల పార్కింగ్‌ కు స్థలం లేకపోవ డంతో నిత్యం ట్రా ఫిక్‌ సమస్య వెంటా డుతోంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో వాహనాలపై జిల్లా లోని పలు ప్రాంతా ల నుంచి సేదదీరడా నికి వస్తుంటారు. ఇక్కడ వాహనాలు నిలిపి ఉంచడానికి ప్రత్యేక స్థలాలు లేకపోవడంతో రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్‌ చేయాల్సి వస్తోంది. దీంతో పర్యాటకులతోపాటు కార్లు, ఆటోలు, భారీవాహ నాల్లో వచ్చే వారంతా అగచాట్లకు గురవుతున్నారు. ప్రధానంలో తీరంలో రోడ్డు ఇరుగ్గా ఉండడం తోపాటు వాహనాలు అదే రోడ్డుపై నిలిపి ఉంచడం ఎదురుగా రాకపోకలు సాగించే పర్యాటకులు తప్పుకోలేని దుస్థితి ఏర్పడింది. ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో పర్యా టకులు కుటుంబాల తో వచ్చి తీరంలో సేదతీరుతుంటా రు. వారు తిరుగుప్రయాణంలో రోడ్డుపై వాహనాల పార్కింగ్‌ వల్ల ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. కొన్నిసార్లు వజ్రపు కొత్తూరు పోలీసులు వచ్చి ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేయాల్సి వస్తోందని స్థానికులు చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పం దించి శివసాగర్‌ తీరంలో వాహనాలు పార్కింగ్‌ సమస్యకు శాశ్వతపరిష్కారం చూపాలని కోరారు.

Updated Date - Aug 03 , 2026 | 12:07 AM