Share News

నేడు ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ముత్యాల ముగ్గుల పోటీలు

ABN , Publish Date - Jan 02 , 2026 | 11:49 PM

pearl triples competition సంక్రాంతి వేళ ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’.. ఏటా మాదిరి ఈ ఏడాదీ ముత్యాల ముగ్గుల పోటీల నిర్వహణకు సన్నద్ధమైంది. జిల్లా, రాష్ట్రస్థాయిలో ముగ్గుల పోటీలు నిర్వహించి.. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనుంది.

నేడు ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ముత్యాల ముగ్గుల పోటీలు

  • శ్రీకాకుళం ఎన్టీఆర్‌ ఎంహెచ్‌ స్కూల్‌ గ్రౌండ్‌లో నిర్వహణకు ఏర్పాట్లు

  • శ్రీకాకుళం, జనవరి 2(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి వేళ ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’.. ఏటా మాదిరి ఈ ఏడాదీ ముత్యాల ముగ్గుల పోటీల నిర్వహణకు సన్నద్ధమైంది. జిల్లా, రాష్ట్రస్థాయిలో ముగ్గుల పోటీలు నిర్వహించి.. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనుంది. ఈసారి ‘ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌’ నిర్వహిస్తున్న సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలు.. (పవర్డ్‌ బై : సన్‌ఫీస్ట్‌ మ్యాజిక్‌ మామ్స్‌ బిస్కెట్‌, టేస్ట్‌ పార్టనర్‌ స్వస్తిక్‌ మసాలా, ప్రేయర్‌ పార్టనర్‌ పరిమళ్‌ మందిర్‌ భారత్‌ వాసి అగరబత్తీ) శనివారం జరగనున్నాయి. శ్రీకాకుళంలోని ఏడురోడ్ల జంక్షన్‌ సమీపంలో ఉన్న ఎన్టీఆర్‌ మునిసిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో ఈ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముగ్గుల పోటీలు శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలతో ముగుస్తాయి. ఈ పోటీలను న్యాయనిర్ణేతలు పర్యవేక్షిస్తారు. జిల్లాస్థాయిలో ఆకర్షణీయమైన మూడు ముగ్గులను ఎంపిక చేసి విజేతలకు బహుమతులతోపాటు నగదు పురస్కారాన్ని అందజేస్తారు. ప్రథమ విజేతకు రూ.6వేలు, ద్వితీయ విజేతకు రూ.4 వేలు, తృతీయ విజేతకు రూ.3వేలు నగదుతోపాటు మెమొంటోలను అందజేస్తారు. ఇందులో పాల్గొన్నవారికి కన్సొలేషన్‌ బహుమతులు కూడా ఇస్తారు.

  • శ్రీకాకుళంలో జరిగే జిల్లాస్థాయి ముగ్గుల పోటీలకు స్పాన్సర్‌గా మీనాక్షి హాస్పెటల్‌ ప్రముఖ సర్జికల్‌ గ్రాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌, లేపరోస్కోపిక్‌ సర్జన్‌ డా.గంగాధర్‌రావు గొండు, స్త్రీ ప్రసూతి వైద్యనిపుణులు, లేపరోస్కోపిక్‌ సర్జన్‌ డా.సీహెచ్‌ హరిత వ్యవహరిస్తున్నారు.

  • రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో కూడా భారీగా నగదు బహుమతులను గెలుచుకోవచ్చు. శ్రీకాకుళంలోని ముగ్గుల పోటీల్లో గెలుపొందినవారిలో ప్రథమ విజేత.. ఈనెల 10న విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి ముగ్గుల పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు. జిల్లాకు చెందిన మహిళలు.. ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొని అందమైన ముగ్గులు వేసి ఆకర్షణీయమైన బహుమతులను గెలుచుకోవాలని ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ పిలుపునిస్తోంది. ఆసక్తి గల మహిళలు.. 9985411526 నెంబర్‌కు సంప్రదించి పేర్లను రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలి.

Updated Date - Jan 02 , 2026 | 11:49 PM