Share News

నేడు రంజాన్‌

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:09 AM

Ready to RamaZan celebrations పవిత్ర రంజాన్‌ ఉపవాస దీక్షలు శుక్రవారం సాయంత్రంతో ముగిశాయి. శనివారం రంజాన్‌ పండుగను జరుపుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు.

నేడు రంజాన్‌
జామియా మసీదులో విందు చేస్తున్న ముస్లింలు

ముగిసిన ఉపవాస దీక్షలు

అరసవల్లి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): పవిత్ర రంజాన్‌ ఉపవాస దీక్షలు శుక్రవారం సాయంత్రంతో ముగిశాయి. శనివారం రంజాన్‌ పండుగను జరుపుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. జిల్లాలోని అన్ని మసీదులను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. శ్రీకాకుళంలోని జామియా మసీదులో శుక్రవారం సాయంత్రం ముస్లింలు పెద్దఎత్తున విందులో పాల్గొన్నారు. శనివారం ఈ మసీదులో నమాజ్‌లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ముస్లింలు తక్బీర్‌ చదువుతారు. అనంతరం ఇమామ్‌లు ప్రత్యేక సందేశం ఇస్తారు. మసీదుల వద్ద ఒకరికొకరు ఈద్‌ముబారక్‌ చెప్పుకోనున్నారు.

Updated Date - Mar 21 , 2026 | 12:09 AM