ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు సమన్వయంతో వ్యవహరించాలి
ABN , Publish Date - Nov 30 , 2026 | 12:12 AM
ప్రశాంతంగా ఎన్నికలనిర్వహణకు పీవోలు సిబ్బందితో సమన్వయంతో వ్యవహ రించాలని ఎంపీడీవోలు సూచించారు. ఆదివారం జలుమూరు, నందిగాం, నరసన్నపే టల్లో పంచాయతీ ఎన్నికల పీవో, ఏపీవోలకు శిక్షణ తరగతులు నిర్వహించారు.
ప్రశాంతంగా ఎన్నికలనిర్వహణకు పీవోలు సిబ్బందితో సమన్వయంతో వ్యవహ రించాలని ఎంపీడీవోలు సూచించారు. ఆదివారం జలుమూరు, నందిగాం, నరసన్నపే టల్లో పంచాయతీ ఎన్నికల పీవో, ఏపీవోలకు శిక్షణ తరగతులు నిర్వహించారు.
ఫజలుమూరు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఓటింగ్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జలుమూరు ఎంపీడీవో బి.చిన్నమ్మడు కోరారు. గ్రామాల్లో మూడో విడత నిర్వహించే పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. ఆదివారం జలుమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పీవో, ఏపీవోలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పనిచేసి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. పోలింగ్ జరిగే సమయంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తితే ఎన్నికల నియమావళి అనుసరించి పనిచేయాలని తెలిపారు. సమావేశంలో మండల ప్రత్యేకాధికారి జయంతు ప్రసాద్, ఎంఈవోలు మాధవరావు, ప్రసాదరావు పాల్గొన్నారు.
ఫనరసన్నపేట, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించడంతో పీవోలు కీలక పాత్రపోషించాలని ఎంపీడీవో వెంకటేష్‌ప్రసాద్ సూచించారు. ఆదివారం నరసన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో పీవోలకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ అనంతరం కౌంటింగ్ పక్రియ వివాదాలకు తావులేకుండా నిర్వహించాలని సూచించారు. అత్యసరమైన పరిస్థితులు ఏర్పడితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవోలు దాలినాయుడు, శాంతారావు తదితరులు పాల్గొన్నారు.
ఫనందిగాం, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): సర్పంచ్‌లు, వార్డుల సభ్యుల ఎన్నికల్లో పోలింగ్ అధికారులు పాత్ర కీలకమని ఎంపీడీవో యు.కుమార్‌పట్నాయక్, ఉప ఎంపీడీవో టి.హరికృష్ణ తెలిపారు. ఆదివారం నందిగాంలో డిసెంబరు రెండో తేదీన జరగనున్న ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. మాస్టర్ ట్రైనీలు బి.లోకనాధం, శ్రీనివాసరావు, టి.కుమారస్వామిలు పోలింగ్ తీసుకోవాల్సిన అంశాలపై వివరించారు.
జలుమూరు: శిక్షణ తరగతుల్లో మాట్లాడుతున్న ఎంపీడీవో చిన్నమ్మడు :జలుమూరు 2
1111111