కడచూపు దక్కేలా..
ABN , Publish Date - Jan 30 , 2026 | 11:59 PM
పొట్టకూటి కోసం ఒంటరిగా పరాయి దేశం వెళ్లాడు. అనారోగ్య సమస్యలతో కాలం చేశాడు.
ఇరాక్‌లో జాడుపూడి వాసి మృతి
కేంద్రమంత్రి రామ్మోహన్ చొరవతో నేడు స్వగ్రామానికి మృతదేహం
కంచిలి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): పొట్టకూటి కోసం ఒంటరిగా పరాయి దేశం వెళ్లాడు. అనారోగ్య సమస్యలతో కాలం చేశాడు. తమ ఇంటి పెద్ద చివరి చూపుకోసం ఆ కుటుంబం వేయికళ్లతో ఎ దురు చూసింది. సమస్యను కేంద్రమంత్రి కింజరా పు రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఆయన స్పందించి ఆ కుటుంబానికి భరో సా ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకుని ఇరాక్ ఎం బసీతో మాట్లాడి మృతదేహాన్ని స్వదేశానికి తీసు కువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. కంచిలి మండలం జాడుపూడి గ్రామానికి చెందిన పిలక బాలకృష్ణ ఇరాక్ దేశం బాగ్దాద్‌లో ఎక్స్‌కవేటర్ మెకానిక్‌గా పనిలోకి చేరాడు. గడచిన ఐదేళ్లుగా అక్కడే పని చేశాడు. అవకాశం వ చ్చినప్పుడల్లా సొంతూరుకు వచ్చి కుటుంబ సభ్యు లను చూసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కొద్దినెలల కిందట గ్రామానికి వచ్చిన బాలకృష్ణ ఈనెల 2న తిరిగి బాగ్దాద్ పయనమయ్యాడు. యాథావిధిగా డ్యూటీకి వెళుతున్న సమయంలో మెదడు సంబంధిత అనారోగ్య కారణాలతో ఈనెల 13న మృతి చెందాడు. ఇరాక్ దేశంలోని బాగ్దాద్‌లో తెలిసిన వారెవరూ లేకపోవడం తో ఆయన ఒక్కడే ఉండడం, ఆయన మృతి చెందిన త రువాత మృతదేహా న్ని చివరి చూపు చూసేందుకు ఆ కుటుంబం, గ్రామ పెద్దలు తీవ్ర ప్ర యత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బెందాళం అశోక్ సమస్యను కేంద్ర పౌర విమానయాన శాఖామం త్రి రామ్మోహన్‌నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఆయన స్పందించి విదేశాంగశాఖ అధి కారుల ద్వారా ఇరాక్ ఎంబసీతో సంప్రదింపులు చేశారు. ఈ నేపథ్యంలో మృతదేహాన్ని అక్కడి నుంచి శుక్రవారం ఢిల్లీకి తీసుకువచ్చారు. అక్కడి నుంచి సొంత ఊరు జాడు పూడికి పంపించే బాధ్యతను సైతం రామ్మోహన్ నా యుడు తీసుకున్నారు. శనివారం బాలకృష్ణ మృతదే హం స్వగ్రామం చేరుకోనుంది. అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారు. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి తోడ్పాటు అందిస్తానని రామ్మోహన్ నాయిడు తెలిపారు. మృతదేహాన్ని స్వదేశం తీసుకు వచ్చేం దుకు కృషి చేసిన కేంద్రమంత్రి రామ్మోహన్, ఎమ్మెల్యే అశోక్ లకు గ్రామస్థులు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.