Share News

అర్హులందరికీ హక్కు పత్రాలు

ABN , Publish Date - Sep 28 , 2026 | 11:47 PM

అర్హులైన రైతులం దరికీ హక్కు పత్రాలు అందించేందుకు కృషి చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. తరతరాలుగా భూములను సాగు చేసుకుం టున్నా హక్కు పత్రాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

 అర్హులందరికీ హక్కు పత్రాలు
కోటబొమ్మాళి: కండువావేసి టీడీపీలోకి ఆహ్వానిస్తున్న అచ్చెన్నాయుడు:

సంతబొమ్మాళి(కోటబొమ్మాళి), సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): అర్హులైన రైతులం దరికీ హక్కు పత్రాలు అందించేందుకు కృషి చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. తరతరాలుగా భూములను సాగు చేసుకుం టున్నా హక్కు పత్రాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సోమవారం సంతబొమ్మాళి మండలపరిషత్‌ కార్యాలయంలో తొమ్మిది గ్రామాలకు చెందిన 5,078 రైతులకు రాజముద్ర గల పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీచేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ భూములు రైతుల ఆధీనంలో ఉన్న రికార్డుల్లో అగ్రహారం, దేవదాయ తదితర వర్గీకరణలతో నమోదై ఉండడం, యాజమాన్య వివరాల్లో సమస్యల వల్ల అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతుండడంతో దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి దన్నారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో ఎన్‌.కృష్ణమూర్తి, దేశం నేతలు కూచెట్టి కాంతారావు, ఎల్‌ఎల్‌ నాయుడు, బాడాన రమణమ్మ, రెడ్డి అప్పన్న, ఉక్కళ్ల శ్రీని వాసరావు, తహసీల్దార్‌ హేమసుందరరావు, ఎంపీడీవో పార్వతీశం పాల్గొన్నారు.

ప్రతిఒక్కరికీ పథకాలు చేరాలి

కోటబొమ్మాళి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్క రూ భాగస్వాములు కావాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతిఒక్కరికీ చేరేలా చూడాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు. కోటబొమ్మాళి వైసీపీ మండలాధ్యక్షుడు, మాజీ సర్పంచ్‌ ప్రతినిధి సంపతిరావు హేమసుందరరాజు సొంతపంచాయతీ పరిధిలో గల మాసా హెబ్‌పేట, కమలనాభపురం నుంచి సోమవారం 50 కుటుంబాలు అచ్చెన్నాయుడు సమక్షంలో నిమ్మాడ క్యాంపుకార్యాలయంలో టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు టీడీపీలో సముచిత గౌరవం, తగిన ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఈగల పాపారావు పాల్గొన్నారు.

కొత్తమ్మతల్లిని ఉత్సవాలకు ఏర్పాట్లుచేయాలి

అక్టోబరు 13 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న కొత్తమ్మతల్లి ఉతవాల నాటికి ఆలయ ప్రాంగణం శుభ్రంగా ఉండాలని, భక్తులకు ఇబ్బందిలేకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ సిబ్బందికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. స్థానిక కొత్తమ్మతల్లిని అచ్చెన్నాయుడు సోమవారం దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయం ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

Updated Date - Sep 28 , 2026 | 11:47 PM