టైర్ పంక్చర్.. కారు బోల్తా
ABN , Publish Date - May 03 , 2026 | 12:13 AM
ఈ కారు ప్రమాదం చూస్తేంటే అందులో ప్రయాణిస్తున్నవారి పరిస్థితి ఊహించుకోవడానికి కూడా భయమేస్తుంది కదూ. ప్రాణ నష్టమైనా.. లేకుంటే తీవ్రంగా గాయపడే అవకాశం ఉండొచ్చన్న అభిప్రా యం కలుగకమానదు.
త్రుటిలో తప్పిన ప్రమాదం
టెక్కలి, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): ఈ కారు ప్రమాదం చూస్తేంటే అందులో ప్రయాణిస్తున్నవారి పరిస్థితి ఊహించుకోవడానికి కూడా భయమేస్తుంది కదూ. ప్రాణ నష్టమైనా.. లేకుంటే తీవ్రంగా గాయపడే అవకాశం ఉండొచ్చన్న అభిప్రా యం కలుగకమానదు. ఎందుకంటే నిత్యమూ అధిక సంఖ్యలో వాహనాలు రాక పోకలు సాగించే జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం గోపీనాథపురం గ్రామానికి చెందిన నేవీ ఉద్యోగి వెంకటేష్ శనివారం విశాఖ నుంచి స్వగ్రామానికి కారు వస్తున్నాడు. ఈ క్రమంలో జాతీయ రహదారి లచ్చన్నపేట సమీపానికి వచ్చేసరికి కారు అదుపు తప్పి డివైడర్ ఢీకొనడంతో టైర్ పంక్చర్ అయి ఇలా రహదారి మధ్యలో బోల్తా పడింది. కారులో నడుపుతున్న వెంకటేష్ మాత్రం క్షేమంగా బయపడ్డాడు. ఆ సమయంలో ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.