Share News

పెళ్లి పీటలు ఎక్కాల్సిన సమయం..

ABN , Publish Date - Apr 01 , 2026 | 12:04 AM

రెండు రోజు ల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ యువకుడిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కాటేసింది.

పెళ్లి పీటలు ఎక్కాల్సిన సమయం..
పురుషోత్తం (ఫైల్‌)

  • రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు

  • చికిత్స పొందుతూ యువకుడి మృతి

కంచిలి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): రెండు రోజు ల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ యువకుడిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కాటేసింది. పెద్ద దిక్కుగా ఉంటాడని భావించిన ఆ తల్లి ఆశలు అడియాశలయ్యాయి. తండ్రిలేని ఆ కుటుంబానికి కుమారుడు వలసకూలీగా ఉంటూ జీవితాంతం తోడుంటాడని భావించిన ఆ తల్లిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. వివరాలిలా ఉన్నాయి.. కవిటి మండలం తలగానపుట్టుగ గ్రామానికి చెందిన మదనాల పురుషోత్తం(29) పెద్ద శ్రీరాంపురం సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వివాహ సమయం దగ్గర పడడంతో సోంపేట మండలం జింకిభద్రలో బంధువులను కలిసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో పెద్ద శ్రీరాంపురం హైస్కూల్‌ సమీపంలో మాణిక్యపురం వైపు నుంచి ఎదురుగా వస్తున్న లగేజీ వ్యాన్‌ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో పురుషోత్తం తలకి, భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పురుషోత్తం మంగళవారం ఉదయం మృతి చెందాడు.

ఖతార్‌లో వలసకూలీగా..

పురుషోత్తం ఖతార్‌లో వలసకూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోంపేట మండలం రాజాం గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశఽ్చయం కావడం, యుద్ధ సమస్యల కారణంగా ముందుగానే రావాల్సి ఉన్నా సాధ్యం కాలే దు. ఎట్టకేలకు మూడు రోజుల కిందట స్వగ్రామానికి వచ్చాడు. ఏప్రిల్‌ 2వ తేదీ వివాహం, 12వ తేదీ రిసెప్షన్‌ నిర్వహించేం దుకు పెద్దలు ఏర్పా ట్లు చేశారు. ఇంతలో రోడ్డు ప్రమాదం రూపంలో అతడు మృత్యుఒడి లోకి చేరుకోవడంతో కుటుంబ సభ్యులను ఓదార్చ డం ఎవరితరం కావడం లేదు. మృతుడి తల్లి దాలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ పారినాయిడు తెలిపారు.

Updated Date - Apr 01 , 2026 | 12:04 AM