Share News

చున్నీ బిగించి.. ఊపిరి తీసి

ABN , Publish Date - Sep 30 , 2026 | 11:50 PM

కాశీబుగ్గ గాంధీనగర్‌లోని ఓ లాడ్జిలో మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమె మెడకు చున్ని బిగించి చంపేసినట్లు పోలీసులు గుర్తించారు.

 చున్నీ బిగించి.. ఊపిరి తీసి
గోడువు లక్ష్మి(ఫైల్‌)

- లాడ్జిలో మహిళ దారుణ హత్య

- సహజీవనం చేస్తున్న వ్యక్తిపై పోలీసుల అనుమానం

- మృతురాలిది టెక్కలి

పలాస, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ గాంధీనగర్‌లోని ఓ లాడ్జిలో మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమె మెడకు చున్ని బిగించి చంపేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. పోలీసుల వివరాల మేరకు.. టెక్కలి సర్వమంగళవీధికి చెందిన గోడువు లక్ష్మి అనే మహిళ భర్త నుంచి ఐదేళ్ల కిందట విడిపోయి విజయవాడ వెళ్లిపోయింది. అక్కడ హోటల్‌లో కార్మికుడిగా పనిచేస్తున్న ముత్తు అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. రెండు నెలల కిందట విజయవాడ నుంచి టెక్కలికి లక్ష్మి వచ్చింది. బుధవారం ఉదయం 11 గంటలకు కాశీబుగ్గలోని ఓ లాడ్జికి వచ్చి రూమ్‌ తీసుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ముసుగు వేసుకున్న ఓ వ్యక్తి లాడ్జికి వచ్చి నేరుగా లక్ష్మి ఉంటున్న గదికి వెళ్లాడు. లక్ష్మి లాడ్జి అద్దెను తక్కువగా ఇవ్వడంతో, 3 గంటల సమయంలో లాడ్జి సిబ్బంది ఆమెకు ఫోన్‌ చేయగా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి వారు వెళ్లి గది తలుపు కొట్టారు. ఎంతకీ తీయకపోవడంతో వేరే తాళంతో రూము తెరవగా, మంచంపై ఆమె అచేతనంగా పడిఉంది. అనంతరం కాశీబుగ్గ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌, సిబ్బంది చేరుకుని వివరాలు సేకరించారు. మెడకు చున్ని బిగించి హత్య చేసినట్లు గుర్తించారు. క్లూస్‌ టీమ్‌ వచ్చి ఆధారాలు సేకరించింది. ముసుగు వేసుకొని వచ్చిన వ్యక్తే ఆమెను హత్య చేసి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అది ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. విజయవాడలో సహజీవనం చేస్తున్న వ్యక్తిపనే అని పోలీసులు భావిస్తున్నారు. ఆయన కోసం వెతుకులాట ప్రారంభించారు. మధ్యాహ్నం అగంతకుడు వచ్చిన గంట వ్యవధిలోనే హత్య జరిగిందని అక్కడ కనిపిస్తున్న ఆధారాలబట్టి తెలుస్తోంది. లక్ష్మికి పిల్లలు ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Sep 30 , 2026 | 11:50 PM