650 మందితో పటిష్ఠ భద్రత
ABN , Publish Date - Apr 27 , 2026 | 12:15 AM
జిల్లాకు భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సోమవారం రానున్న నేపథ్యంలో 650 మంది అధికారులు, పోలీసు సిబ్బందితో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు.
నేటి ఉప రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో..
అప్రమత్తంగా విధులు నిర్వహించండి
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సోమవారం రానున్న నేపథ్యంలో 650 మంది అధికారులు, పోలీసు సిబ్బందితో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. ఈ మేరకు పోలీసు బందోబస్తుపై విధి విధానాలు, నిర్వహణపై ఆదివారం అరసవల్లి వద్ద పోలీస్ అధికారులు, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప రాష్ట్రపతి కాన్వాయ్ ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి 80 అడుగుల రోడ్డు మార్గం ద్వారా మిల్లు జంక్షన్, అరసవల్లి, శ్రీకూర్మం పుణ్య క్షేత్రాల వరకు ప్రయాణించనున్నందున ఆ మార్గ మధ్యంలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాన్వాయ్ వెళ్లే సమయంలో ప్రజలకు అసౌకర్యం లేకుండా సముఽస్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేసి ట్రాఫిక్ మళ్లించాలన్నారు. ముఖ్య కూడళ్ల వద్ద నిర్దేశిత స్టాపర్లను ఏర్పాటు చేసి అదనపు సిబ్బందిని మోహరించాలని ఆదేశిం చారు. రూట్ మొత్తంలో రోడ్ ఓపెనింగ్ పార్టీలు, బాంబ్, డాగ్ స్వ్వాడ్ బృందాలతో విస్తృతంగా తనిఖీ చేపట్టాలన్నారు. ఉప రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు, రూట్ మ్యాప్, ట్రాఫిక్ నియంత్రణ, హెలీప్యాడ్ ఏర్పాట్లు, రహదారి మార్గభద్రత, పుణ్యక్షేత్రాల వద్ద తీసుకో వాల్సిన చర్యలు, అత్యవసర సేవల తదితర అంశాలపై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ ఎటువంటి లోపాలకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు అమలు చేయాలని దేశించారు. ఉప రాష్ట్రపతి పర్యటన ముగిసిన తర్వాత విశాఖపట్నం చేరు కొనే వరకు ప్రతి ఒక్కరూ వారికి అప్పగించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాల న్నారు. సమావేశంలో పలువురు పోలీసు అధికా రులు, సిబ్బంది పాల్గొన్నారు.