Share News

పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత

ABN , Publish Date - Nov 26 , 2026 | 12:44 AM

జిల్లాలో జరుగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి నట్టు ఏఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు.

పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత
సూచనలిస్తున్న ఏఎస్పీ శ్రీనివాసరావు

  • ఏఎస్పీ శ్రీనివాసరావు

పలాస రూరల్‌, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జరుగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి నట్టు ఏఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. పలాస మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో పోలీసు అధికారుల, సిబ్బందితో సమీక్షించారు. గ్రామాల్లో ఎన్నికలు జరిగే ప్రదేశంలో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారిం చామని, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్ని కలు జరిగేలా పటిష్ఠ మైన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. ఎ న్నికలు జరిగే సమయం లో అనవసరమైన వివాదాలకు తావిస్తే చర్యలు తప్పవని, గ్రామాల్లో ఎటువంటి గొడవలు, వివాదాలులేకుండా ఎన్నికలు జరిగేందుకు అందరూ సహకరించాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ఉద్యోగులతో పాటు సిబ్బందిని ప్రజలు సహకరించాలని, పోలింగ్‌ జరిగే చోట బారికేడ్లను తొలగించడం, 100మీటర్ల వరకూ విధించిన నిబంధనలను ప్రతీ ఒక్కరూ కచ్చితంగా పాటించాలని తెలిపారు. సమావేశంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 26 , 2026 | 12:44 AM