కుందువానిపేట ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ
ABN , Publish Date - May 19 , 2026 | 11:53 PM
కుందువానిపేటలో ఇటీవల జరిగిన గృహప్రవేశాల ఘటనపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమి టీ సభ్యులు మంగళవారం సదరు గ్రామాన్ని సందర్శించారు.
శ్రీకాకుళం రూరల్, మే 19(ఆంధ్రజ్యోతి): కుందువానిపేటలో ఇటీవల జరిగిన గృహప్రవేశాల ఘటనపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమి టీ సభ్యులు మంగళవారం సదరు గ్రామాన్ని సందర్శించారు. ఈ సంద ర్భంగా మాజీ సర్పంచ్ సూరాడ సూర్యంతో పాటు గృహప్రవేశంలో పాల్గొన్న ఆరుగురు కుటుంబ సభ్యులను కమిటీ సభ్యులు డీఎస్పీ వివేకా నంద, ఆర్డీవో వేణుగోపాల్, హౌసింగ్ పీడీ రమాకాంత్ విచారించారు. జరిగిన పరిణామాలు, అక్కడి పరిస్థితులపై వివరాలు సేకరించారు. అనం తరం గ్రామస్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఘటన పూర్తి వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనునట్లు వారు తెలిపారు.
‘ఽధర్మాన కోర్టు ఆదేశాలు ఉల్లంఘించారు’
శ్రీకాకుళం రూరల్, మే 19(ఆంధ్రజ్యోతి): కుందువానిపేటలో ఆరు ఇళ్లల్లో తాళాలు పగులగొట్టి, బలవంతంగా గృహప్రవేశాలను చేయించి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని నియోజకవర్గ టీడీపీ నాయకులు గొండు రమణమూర్తి, మూకళ్ల శ్రీని వాస్, సూరాడ అప్పన్న అన్నారు. నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికే సునామీ ఇళ్లు పొందిన వారికి మరలా ఇళ్లు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.