Share News

మూణ్నాళ్ల ముచ్చటే..

ABN , Publish Date - Feb 09 , 2026 | 11:44 PM

టెక్కలిలో గోశాల నిర్వహణ మూణాళ్ల ముచ్చటగా మిగిలింది. మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు ఆఘమేఘాలపై ఏర్పాటుచేసిన గోశాల నిర్వహణ ప్రస్తుతం అటకెక్కిం ది. దీంతో ప్రస్తుతం రోడ్లపై యథేచ్ఛగా పశువులు సంచరిస్తున్నాయి.

మూణ్నాళ్ల ముచ్చటే..
టెక్కలిలో నిరుపయోగంగా ఉన్న గోశాల :

టెక్కలి, ఫిబ్రవరి9(ఆంధ్రజ్యోతి): టెక్కలిలో గోశాల నిర్వహణ మూణాళ్ల ముచ్చటగా మిగిలింది. మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు ఆఘమేఘాలపై ఏర్పాటుచేసిన గోశాల నిర్వహణ ప్రస్తుతం అటకెక్కిం ది. దీంతో ప్రస్తుతం రోడ్లపై యథేచ్ఛగా పశువులు సంచరిస్తున్నాయి.

టెక్కలిలో రోడ్లు పరిశుభ్రంగా ఉండడంతోపాటు ప్రమాదాలు జరగకుండా చర్యలుతీసుకోవాలన్న ఆలో చనతో రోడ్లపై పశువులు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెక్క లి పంచాయతీ యంత్రాంగానికి ఆదేశించారు. దీంతో స్థానిక వంశధార కాలనీలో ఎకరా స్థలంలో గోశాల యుద్ధప్రాతిపదికన నిర్మించారు. పట్టుకున్న గోవులను గోశాలకు తరలించిన తర్వాత అవసరమైన పశుగ్రా సం, తాగునీరుసౌకర్యం కల్పించడం, సిబ్బంది నియా మకంపై పశుసంవర్ధకశాఖ అధికారులకు ఆదేశించా రు. దీంతోఏడాదిన్నర కిందట మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు కలెక్టర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌, పశు సంవర్ధకశాఖ ఉన్నతాధికారుల సమక్షంలో గోశాలను ప్రారంభించారు. మొదట్లో పంచాయతీ యంత్రాంగం సిబ్బందితో రోడ్లపై తిరిగే గోవులు గోశాలకు తరలించే వారు. అయితే సదరు గోవుల యజమానులు రోడ్లపై గోవులను వదలడం తప్పేనని, కొంతఅపరాధ రుసు ము చెల్లించి గోశాలలోఉన్న ఆవులను తీసుకువెళ్లేవా రు. ఈనేపథ్యంలో గోశాల ప్రాంతంలో ఓ ప్రజాప్రతి నిధి కుమారుడి వివాహం నిర్వహించిన తర్వాత గోశాలకు కొంత నష్టం వాటిల్లింది. ఆ తర్వాత గోశాల నిర్వహణను పంచాయతీ యంత్రాంగం, పశుసంవ ర్ధకశాఖ అధికారులు విస్మరించారు.దీంతో గతంలో మాదిరిగా యథేచ్ఛగా టెక్కలిలో రోడ్లపై గోవులు తిరిగేవి. ఈ నేపథ్యంలో టెక్కలిలో వచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు రోడ్లపై సంచరిస్తున్న ఆవులను చూసి పం చాయతీ యంత్రాంగానికి పశువులు తిరగ కూడదని మరోసారి స్పష్టంచేశారు. దీంతో పంచాయతీ యంత్రాంగం 16 గోవులను పట్టుకొని బారువ గోశాలకు పంపించారు. అయితే గోవులను పట్టుకోవడానికి పంచాయతీ యంత్రాంగా నికి సైతం తలకుమించిన భారమైంది. దీంతో పంచా యతీ సిబ్బంది పూర్తిగా గోవులను పట్టుకోవడం మానే శారు. ఇక పశుసంవర్ధకశాఖ గోశాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో గోశాల నిర్వీర్యమైంది. మళ్లీ ఎప్ప టిలాగే టెక్కలిలో రోడ్లపై గోవులు యథేచ్ఛగా తిరుగు తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పలువు రు చెబుతున్నారు. ప్రధానంగా పాతజాతీయ రహదా రి, జడ్పీ రోడ్డు, పాతబస్టాండ్‌, ఎన్‌ఎం రోడ్డు తదితర ప్రాంతాల్లో రోడ్లుపై పశువులు సంచారం మరింత పెరిగింది.

గోశాలకు తరలిస్తాం

త్వరలో స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా రోడ్లపై తిరుగుతున్న గోవులను పట్టుకొని సుదూర ప్రాంతాల్లో గల గోశాలకు తరలిస్తామని పంచాయతీకార్యదర్శి ఏవీ శ్రీనివాస్‌ తెలిపారు. గతంలో రోడ్లుపై తిరుగుతున్న గోవులను పట్టుకొని వెయ్యేసి రూపాయలు అపరాధ రుసుం విధించామని చెప్పారు. అయితే కొందరు గోవుల యజమానుల్లో పరివర్తన రాలేదని తెలిపారు.

Updated Date - Feb 09 , 2026 | 11:50 PM