గ్యాస్ లీకై ముగ్గురికి గాయాలు
ABN , Publish Date - Sep 05 , 2026 | 11:18 PM
బసవకొత్తూరు గ్రామంలో వంట గ్యాస్ లీకై ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..
కవిటి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): బసవకొత్తూరు గ్రామంలో వంట గ్యాస్ లీకై ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పిట్ట మహాలక్ష్మి శనివారం ఇంటిలో వంట చేస్తున్న సమ యంలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఆమెకు, మంటలను అదుపు చేసేందుకు వెళ్లిన పిట్ట కుమారికి మంటలు తగి లాయి. వెంటనే కేకలు వేయడంతో పక్క ఇంటి నుంచి నీలగిరి భాగ్యలక్ష్మి గోనె సంచి పట్టుకొని ఇంట్లోకి వెళ్లింది. దాం తో ఆమెకు మంటలు అంటుకున్నాయి. వెంటనే గ్రామ స్థులు పరిస్థితిని గమనించి సోంపేట అగ్నిమాపక సిబ్బందికి సమాచార మిచ్చారు. రేకుల ఇంటిలో ప్రమాదం జరగడంతో సామాన్లు కాలిబూడిద య్యాయి. ముగ్గురు మహిళలను చికిత్స నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి శ్రీకాకుళం ఆసు పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని సిలిండర్ మంటలను ఆదుపులోకి తీసుకురావడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. రేకుల ఇళ్లు కావడంతో సామాన్లు, పైకప్పు పూర్తిగా పాడయ్యాయని ఫైర్ ఆఫీసర్ ఆర్.సూర్యారావు తెలిపారు.