Share News

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో ముగ్గురికి జరిమానా

ABN , Publish Date - Jan 12 , 2026 | 12:11 AM

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో ముగ్గురికి రూ.10 వేలు చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని సీఐ బి.మంగరాజు తెలిపారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో ముగ్గురికి జరిమానా

సోంపేట, జనవరి 11(ఆంధ్రజ్యోతి): డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో ముగ్గురికి రూ.10 వేలు చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని సీఐ బి.మంగరాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. బారువ పోలీసులు ఇటీవల తనిఖీ చేస్తుండగా.. మెళియాపుట్టి మండలం భరణికోట గ్రామానికి చెందిన సవర బాలరాజు, మందస మండలం ఉమాగిరికి చెందిన పొందర ప్రసాద్‌, సోం పేట మండలం దేవాది వాసులు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డా రు. వీరిని కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి కంచి శ్రీనివాసరావు విచారించి రూ.10 వేలు వంతున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారని సీఐ తెలిపారు.

Updated Date - Jan 12 , 2026 | 12:11 AM