బైండోవర్ ఉల్లంఘనపై ముగ్గురికి జరిమానా
ABN , Publish Date - Oct 08 , 2026 | 12:25 AM
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా గతంలో ఎస్‌ఐ రంజిత్ సమక్షంలో తహసీల్దార్ పి.శ్రీనివాసరావు ముగ్గురు వ్యక్తులను బైండోవర్ చేశారు.
ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల చొప్పున వసూలు
పోలాకి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా గతంలో ఎస్‌ఐ రంజిత్ సమక్షంలో తహసీల్దార్ పి.శ్రీనివాసరావు ముగ్గురు వ్యక్తులను బైండోవర్ చేశారు. అయితే ఆ ముగ్గురు వ్యక్తులు బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించారు. దీంతో ఒక్కొక్కరికి రూ.2లక్షలు చొప్పున ముగ్గురుకి రూ.6 లక్షలు జరిమానా విధించి వసూలు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తేకఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ రంజిత్, తహసీల్దార్ శ్రీనివాసరావు హెచ్చరించారు.