గంజాయితో ముగ్గురి అరెస్టు
ABN , Publish Date - Jun 18 , 2026 | 12:17 AM
జాతీయ రహ దారిపై నౌపడ- మెళియా పుట్టి రోడ్డు ఫ్లైఓవర్ సమీపంలో మంగళవారం సాయంత్రం 2కేజీల155 గ్రాముల గంజాయితో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని సీఐ ఎ.విజయ్‌కుమార్ తెలిపారు.
టెక్కలి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): జాతీయ రహ దారిపై నౌపడ- మెళియా పుట్టి రోడ్డు ఫ్లైఓవర్ సమీపంలో మంగళవారం సాయంత్రం 2కేజీల155 గ్రాముల గంజాయితో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని సీఐ ఎ.విజయ్‌కుమార్ తెలిపారు. స్థానిక ఓ ప్రైవేట్ ఐటీఐలో చదువుతున్న మెళియాపుట్టికి చెందిన యువకుడు, టెక్కలి భూలోకమాత వీధికి చెందిన కళింగపట్నం కేశవ, ఒడిశాలోని గజపతి జిల్లా బడగాం గ్రామానికి చెందిన సభాపతి బారికిలను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వీరిని అరెస్టు చేసి కోర్టుకు తరలించామని ఆయన వివరించారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాలు, రైల్వేస్టేషన్లు, కూడళ్లలో నిరంతర నిఘా కొనసాగుతోందని చెప్పారు. ఆయనతో పాటు ఎస్‌ఐ రాము ఉన్నారు.