Share News

గంజాయితో ముగ్గురి అరెస్టు

ABN , Publish Date - Mar 12 , 2026 | 12:20 AM

పొన్నాడ పంచాయతీ వెంకన్నగారి పేట సమీపంలో గంజా యితో ముగ్గురు యువ కులను బుధవారం అరె స్టు చేయగా, మరో వ్యక్తి పరారైనట్టు జేఆర్‌ పురం సీఐ ఎం.అవతారం తెలి పారు.

గంజాయితో ముగ్గురి అరెస్టు
వివరాలు తెలియజేస్తున్న సీఐ అవతారం

  • 2.3 కిలోల స్వాధీనం

  • మరో వ్యక్తి పరారీ

  • వివరాలు వెల్లడించిన జేఆర్‌ పురం సీఐ అవతారం

ఎచ్చెర్ల, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): పొన్నాడ పంచాయతీ వెంకన్నగారి పేట సమీపంలో గంజా యితో ముగ్గురు యువ కులను బుధవారం అరె స్టు చేయగా, మరో వ్యక్తి పరారైనట్టు జేఆర్‌ పురం సీఐ ఎం.అవతారం తెలి పారు. సీఐ తెలిపిన వివ రాల మేరకు.. శ్రీకాకుళం నగరం పాత శ్రీకాకుళాని కి చెందిన గంటల సూర్యతేజ, దమ్మలవీధికి చెందిన కేశవ బాలు, సోపేటి కార్తీక్‌, అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం పిట్టగూడకు చెందిన బురి డి లైకోన్‌ గంజాయి తాగుతున్నారు. వీరివద్ద గంజాయి ఉందన్న ముందస్తు స మాచారంతో ఎస్‌ఐ, సిబ్బంది, డిప్యూటీ తహసీల్దార్‌తో కలిసి పట్టుకునేందుకు ప్రయత్నించగా.. కార్తీక్‌ తప్పించుకుని పారిపోగా మిగిలిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తరచూ ఈ ప్రాంతానికి వచ్చి మద్యం, గంజాయిని తీసు కుంటున్నట్టు విచారణలో తేలింది. వీరి నుంచి ద్విచక్ర వాహనంతోపాటు 2.3 కి లోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరకు నుంచి బురిడి లైకోన్‌ గంజా యిని తీసుకువచ్చి ఇక్కడ కిలో రూ.3వేలకు విక్రయిస్తున్నట్టు విచారణలో గుర్తిం చారు. గంజాయి సేవించినా, రవాణాకు పాల్పడినా, విక్రయించినా నేరమన్నారు. అటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని, చట్టపరంగా రౌడీషీట్లు తెరుస్తా మని హెచ్చరించారు. ఎచ్చెర్ల ఎస్‌ఐ జి.లక్ష్మణరావు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Mar 12 , 2026 | 12:20 AM