13 కిలోల గంజాయితో ముగ్గురి అరెస్టు
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:28 AM
బెండిగేటు జంక్షన్ వద్ద మంగళ వారం మధ్యాహ్నం గంజాయి తరలిస్తున్న ముగ్గురును ఆదుపులోకి తీసుకున్నట్టు ఎస్‌ఐ బి.నిహర్ చెప్పారు.
వజ్రపుకొత్తూరు, ఏప్రిల్ 28(ఆఽంధ్రజ్యోతి): బెండిగేటు జంక్షన్ వద్ద మంగళ వారం మధ్యాహ్నం గంజాయి తరలిస్తున్న ముగ్గురును ఆదుపులోకి తీసుకున్నట్టు ఎస్‌ఐ బి.నిహర్ చెప్పారు. వారి నుంచి 13.230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వీరిలో ఇద్దరు గజేంద్ర మండల్, నిమీయా మండల్ ఒడిశాకి చెందిన వారు కాగా దీపక్‌కుమార్ ఢిల్లీకి చెందిన వ్యక్తని తెలిపారు. వీరిపై కేసును నమోదు చేసి కోర్టుకు తరలించగా... న్యాయాధికారి 14 రోజులు రిమాండ్ విధించారని తెలిపారు. దీంతో నిందితులను శ్రీకాకుళం జైలుకు తరలించినట్టు ఎస్‌ఐ నిహార్ తెలిపారు.
మూడు కిలోల గంజాయి స్వాధీనం
సోంపేట, ఏప్రిల్ 28(ఆంధ్ర జ్యోతి): ఒడిశా నుంచి కేరళ రాష్ట్రం కొచ్చికి గంజాయి తరలిస్తున్న నిరంజన్ మాలిక్‌ను బారువ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ మంగరాజు, ఎస్‌ఐ హరిబాబు నాయుడు విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడిం చారు. ఒడిశా రాష్ట్రం కేంద్రపడ్ జిల్లా రాజ్‌కోలిక్ బ్లాక్, చరపడ పంచాయతీ కందిహట్ గ్రామానికి చెందిన నిరంజన్ మాలిక్ ఒడిశాలో 3.135 కిలోల గంజాయి కొనుగోలు చేసి కేరళ రాష్ట్రం కొచ్చిలో సరోజ్ నాయక్‌కు అందించేందుకు తరలి స్తున్నాడన్నారు. మూడు ప్యాకెట్లలో గంజాయిని బ్యాగులో ఉంచి పలాస నుంచి రైలులో కేరళ వెళ్లేందుకు వెళుతుండగా వచ్చిన సమాచారం మేరకు బీఆర్‌సీ పురం సింగ్ దాబా వద్ద మాటువేసి పట్టుకున్నామన్నారు. ఇతడి వద్ద నుంచి సెల్‌ఫోన్, రూ.100 స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశామని తెలిపారు. మాలిక్‌ను న్యాయాధికారి ఎదుట హాజరుపరచనున్నట్లు తెలిపారు.