Share News

బాలిక ఆత్మహత్య కేసులో ముగ్గురి అరెస్టు

ABN , Publish Date - Oct 13 , 2026 | 12:17 AM

కుప్పిలి పంచాయతీ యాతపేట గ్రామా నికి చెందిన ముంత గీత (17) అనే బాలిక ఈ నెల 9 తేదీన ఇంట్లో ప్యాన్‌ కు ఉరి వేసు కుని ఆత్మహత్యకు పాల్ప డింది.

బాలిక ఆత్మహత్య కేసులో ముగ్గురి అరెస్టు
నిందితులతో సీఐ అవతారం, ఎస్‌ఐ లక్ష్మణరావు

ఎచ్చెర్ల, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): కుప్పిలి పంచాయతీ యాతపేట గ్రామా నికి చెందిన ముంత గీత (17) అనే బాలిక ఈ నెల 9 తేదీన ఇంట్లో ప్యాన్‌ కు ఉరి వేసు కుని ఆత్మహత్యకు పాల్ప డింది. ఈ సంఘటనపై గీత తల్లి రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ముగ్గురు యువకులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం, ఎచ్చెర్ల ఎస్‌ఐ జి.లక్ష్మణరావులు తెలిపిన వివరాల ప్రకారం.. లావేరు మండలం కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన నాయని శ్రీరామ్‌ ప్రేమిస్తున్నానని వెంటపడి...ఆ ప్రేమను అంగీకరించకపోతే చనిపోతానని బెదిరించాడు. ఈ క్రమంలో ఆమెకు తెలియకుండా ఫొటోలు తీశాడు. బాలిక కుటుంబంతో విభేదాలు ఉన్న అదే గ్రామానికి చెందిన పెంటమాని సురేష్‌, శ్రీరామ్‌ నుంచి ఆ ఫొటోలు తీసుకున్నాడు. ఆమె కుటుంబాన్ని అగౌరవపర్చాలన్న ఉద్దేశంతో తన తమ్ముడు పెంటమాని జోష్‌ సాయంతో ఆ గ్రామంలోని కుర్రాళ్ల వాట్సాప్‌నకు ఫొటోలు పంపించాడు. ఈ విషయం తెలియడంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో నిందితులు నాయని శ్రీరామ్‌, పెంటమాని సురేష్‌, పెంటమాని జోష్‌లను అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు.

Updated Date - Oct 13 , 2026 | 12:17 AM