Share News

ఆలోచింపజేసిన నాటికలు

ABN , Publish Date - Sep 20 , 2026 | 12:19 AM

నగరం లోని బాపూజీ కళామందిరంలో సుమిత్ర కళాసమితి ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న బహుభాషా నాటిక పోటీల్లో మూడో రోజు శనివారం ఒడిశా, హిందీ నాటికలకు ఆలోచింప జేశా యి.

ఆలోచింపజేసిన నాటికలు
‘ఫేసెస్‌ ఆఫ్‌ ఉమెన్‌’ నాటికలోని ఓ సన్నివేశం

పాత్రలకు జీవం పోసిన కళాకారులు

శ్రీకాకుళం కల్చరల్‌, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): నగరం లోని బాపూజీ కళామందిరంలో సుమిత్ర కళాసమితి ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న బహుభాషా నాటిక పోటీల్లో మూడో రోజు శనివారం ఒడిశా, హిందీ నాటికలకు ఆలోచింప జేశా యి. ఒడిస్సీ భాషలో ‘ఫేసెస్‌ ఆఫ్‌ ఉమెన్‌’ నాటిక ప్రదర్శిం చారు. స్త్రీ తన జీవితంలో ఎదుర్కొన్న వివక్ష, అణచి వేతకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటాన్ని ఈ నాటిక ఆవిష్కరిం చింది. సీత, ద్రౌపది, రజియా సుల్తానా, రాణి లక్ష్మీ బాయి వంటి చారిత్రక, పౌరాణిక పాత్రల జీవితాలను నేటి సాధారణ మహిళల అనుభవాలతో మేళవిస్తూ ఈ కథ సాగింది. విద్యా హక్కు, వివాహం, కుటుంబ వ్యవస్థ, లైంగిక సేచ్ఛ, సామా జిక నియంత్రణ తదితర అంశాలను స్పృశిస్తూ ఆహూతుల హృదయాలను కదిలించేలా కళాకారులు పాత్రలకు జీవం పోశారు.

చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాయ్‌పూర్‌కు చెందిన కళాకారులు ‘యకీనస్‌’ నాటికను హిందీభాషలో ప్రదర్శించారు. ఒక యువకుడి కథ దీనికి ఇతివృత్తం. నూతన ఆలోచనలు, సానుకూల దృక్పథం తో సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలను, చెడు ఆచారాలను మార్చా లని సదరు యువ కుడు చూస్తాడు. నేటి యువత మనస్త త్వాన్ని ప్రతిబిం బిస్తూ దారితప్పిన వారికి కరుణ, ప్రేమ, పశ్చాత్తాపం వంటి మానవీయ విలువల ద్వారా సన్మార్గాన్ని చూపే సందేశాన్ని ఈ నాటిక అందిం చింది. ఈ నాటికలు ఇతర భాషలవైనా కళాకారుల హావభావాలతో పాత్రల్లో ఒది గిన దృశ్యాలు చూపరులను ఆలోచింపజేసి ఆకట్టుకున్నాయి. నాటికలకు నేపథ్య సంగీతం సందర్భోచితంగా ఉంది. కార్యక్రమంలో కళాకారులను నిర్వాహకులు సత్కరించి అభినందించారు.

Updated Date - Sep 20 , 2026 | 12:19 AM