Share News

గణతంత్ర దినోత్సవానికి పక్కా ఏర్పాట్లు: కలెక్టర్‌

ABN , Publish Date - Jan 13 , 2026 | 12:14 AM

గణ తంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కలె క్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశిం చారు.సోమవారం కలెక్టరేట్‌లో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు.

  గణతంత్ర దినోత్సవానికి పక్కా ఏర్పాట్లు: కలెక్టర్‌
మాట్లాడుతున్న స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, జనవరి 12(ఆంధ్రజ్యోతి): గణ తంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కలె క్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశిం చారు.సోమవారం కలెక్టరేట్‌లో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పరేడ్‌ ఏర్పాట్లకు తగు చర్యలు తీసుకోవాలని ఏఆర్‌ డీఎస్పీ శేషాద్రిని ఆదేశిం చారు.అవార్డుల పేర్లను 13వ తేదీలోగా జాబితా పంపా లన్నారు.సమావేశంలో డీఆర్వో లక్ష్మణమూర్తి, అదనపు ఎస్పీ కేవీరమణ, డిప్యూటీ కలెక్టర్‌ పద్మావతి, ఆర్డీవోలు సాయి ప్రత్యూష, వెంకటేష్‌, కృష్ణమూర్తి, జడ్పీ సీఈవో సత్యన్నారాయణ, హౌసింగ్‌ పీడీ రమాకాంతరావు, డీఆ ర్డీఏ పీడీ కిరణ్‌కుమార్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సత్య నారాయణ, డీఎస్‌వో సూర్యప్రకాష్‌, ఎస్పీ కార్పొరేషన్‌ ఈడీ గడ్డెమ్మ, సివిల్‌సప్లయిస్‌ డీఎం వేణుగోపాల్‌, ఆర్టీసీ డీఎం శర్మ, రవాణా శాఖ ఎంవీఐ గంగాధర్‌, డీసీవో యశోదలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2026 | 12:14 AM