Share News

ఈసారి 11 సీట్లు కూడా రావు

ABN , Publish Date - Aug 10 , 2026 | 12:32 AM

ఇప్పుడున్న 11 సీట్లు కూడా రావనే భయంతో గొడ్డలిపార్టీ రోజుకో విన్యాసం చేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.

ఈసారి 11 సీట్లు కూడా రావు
కొత్తపేటలో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను అందజేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

- ఆ భయంతో గొడ్డలి పార్టీ రోజుకో విన్యాసం

-మంత్రి అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ఇప్పుడున్న 11 సీట్లు కూడా రావనే భయంతో గొడ్డలిపార్టీ రోజుకో విన్యాసం చేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. కొత్తపేట గ్రామంలో ఆదివారం ఆయన ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన విజయాలను కరపత్రాల్లో ముద్రించి ప్రజలకు అందజేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో 99శాతం అమలు చేశామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు. వైద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తూ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఐదేళ్ల పాలనలో డీఎస్సీ ఊసే ఎత్తని జగన్‌ నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పాదయాత్ర సమయంలో రెండు మూడేళ్లకోసారి డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పిన జగన్‌ అమలు చేయకుండా మాట తప్పారని గుర్తుచేశారు. కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించిన ఉద్యోగులను ప్రాత్సహించాల్సింది పోయి వారి జీవితాలతో రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్‌ అద్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, రాష్ట్ర కళింగ కార్పోరేషన్‌ చైర్మన్‌ బోయిన గోవిందరాజులు, పీఏసీఎస్‌ అద్యక్షురాలు వెలమల విజయలక్ష్మి, కామేశ్వరావు, దేశం నేతలు బోయిన సత్యశ్రీనివాస్‌, బోయిన రమేష్‌, బాడాన రమణమ్మ, మక్క లక్ష్మణరావు, కల్లి నాగయ్యరెడ్డి, కోరాడ గోవిందరావు, పాగోటి ముత్తురాజు, సుంకరి గణపతిరావు, ధర్మాన నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 10 , 2026 | 12:32 AM