ఇది రైతు ప్రభుత్వం: ఎన్‌ఈఆర్
ABN , Publish Date - Oct 10 , 2026 | 11:53 PM
రైతుల సమస్యలు తెలుసుకొని, వాటిని సత్వరమే పరిష్క రించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఇది రైతుల ప్రభుత్వమని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు.
రణస్థలం, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): రైతుల సమస్యలు తెలుసుకొని, వాటిని సత్వరమే పరిష్క రించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఇది రైతుల ప్రభుత్వమని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. నారా యణపట్నంలో శనివారం సమావేశం ఏర్పాటు చేసి ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి లంక శ్యామలరావు తో కలిసి రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లంకపేట గ్రామానికి రూ.50 లక్షలతో సీసీ రోడ్లను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు లంక ప్రభ, లంక కృష్ణ, ఎం. కనకారావు, తహసీల్దార్ సనపల కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు