రాష్ట్రం కోసం ఆలోచించండి
ABN , Publish Date - Nov 20 , 2026 | 11:55 PM
రాష్ట్రం కోసం మాత్రమే ఆలోచించాలని, ప్రాం తాల కోసం ఎవరూ ఆలోచించవద్దని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు నిచ్చారు.
శ్రీకాకుళం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం కోసం మాత్రమే ఆలోచించాలని, ప్రాం తాల కోసం ఎవరూ ఆలోచించవద్దని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు నిచ్చారు. శుక్రవారం శ్రీకాకుళంలో నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండుశంకర్, కూటమి తరఫున పోటీ లో నిలిచిన అభ్యర్థులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2019-24 మధ్యకాలంలో దుర్మార్గమైన పాలన అందించిన అప్పటి నాయకు లను ప్రజలు అసహ్యించుకున్నారని విమర్శించారు. తననే భయపెట్టాలని చూశారని తెలిపారు. పోటీచేస్తున్న వారితోపాటు, మాటకు గౌరవించినవారిని కూడా గుర్తుపెట్టుకు ని రాబోయేరోజుల్లో ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ఇప్పుడు కొత్తగా వచ్చి మాయమాటలు చెబుతున్నవారు, గతంలో వారి పాలనలో ఏవిధంగా జిల్లా ఉండేదో.. ఇప్పుడు పోటీకి నిల బెట్టిన వ్యక్తి కూడా శ్రీకాకుళం నగరానికి ఏమిచేశారో తెలియజేయగలరా అని ప్రశ్నించా రు. కులాలతో రాజకీయం చేసే వ్యక్తులు బాగుపడలేదని తెలిపారు. తాను అన్ని వేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఎన్నికల బాధ్యతను కేంద్రమంత్రిగా తాను, రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ త్రిమూర్తులుగా తీసుకు న్నామని తెలిపారు. పొత్తుల్లో భాగంగా పోటీ నుంచి విరమించుకున్నవారిని సైతం మంచిస్థానంలో కూర్చుండబెట్టే బాధ్యత తనది అని చెప్పారు. శ్రీకాకుళం స్టేడియం, అరస వల్లి ఆలయం అభివృద్ధి, డ్రైనేజీ సమస్య, నగరం బ్యుటిఫికేషన్ ఇవన్నీ చేసిచూపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జనసేన మేయర్ అభ్యర్థి దానేటి రాధారాణి, డాక్టర్ దానేటి శ్రీధర్, 59 డివిజన్ల కార్పొరేటర్ల అభ్యర్థులు, టీడీపీ నాయకులు పీఎంజే బాబు, మాదా రపు వెంకటేష్ పాల్గొన్నారు.