Share News

ఉనికి కోసం దొంగ నాటకాలు

ABN , Publish Date - Mar 09 , 2026 | 11:50 PM

కేంద్రమంత్రి రామ్మోహన్‌న్నాయుడిపై వైసీపీనాయకులు తప్పుడు విమర్శలు చేస్తున్నారని, వారి ఉనికిని చాటుకునేందుకు దొంగనాటకాలు ఆడుతున్నారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్‌ ధ్వజమెత్తారు.

ఉనికి కోసం దొంగ నాటకాలు
అరసవల్లి: మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌:

అరసవల్లి, మార్చి 9(ఆంధ్రజ్యోతి): కేంద్రమంత్రి రామ్మోహన్‌న్నాయుడిపై వైసీపీనాయకులు తప్పుడు విమర్శలు చేస్తున్నారని, వారి ఉనికిని చాటుకునేందుకు దొంగనాటకాలు ఆడుతున్నారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్‌ ధ్వజమెత్తారు. సోమవారం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడుతూ అమృత్‌ భారత్‌ పథకం ద్వారా జిల్లాలో రైల్వేస్టేషన్ల అభివృద్ధి, దివ్యాంగులకోసం ప్రత్యేక వైద్యశిబిరాలు, పరికరాల పంపిణీ, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుతోపాటుజిల్లా అభివృద్ధికోసం కేంద్రమంత్రి చేసిన పనులుచూసి మాట్లాడాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లాఅధ్యక్షుడు మొదల వలస రమేష్‌, పాండ్రంకి శంకర్‌, పీఎంజేబాబు, ప్రధానవిజయరాం, మాదారపు వెం కటేష్‌, ప్రసాద్‌, వెంకటరమణ, శ్రీనివాస్‌, రాధాకృష్ణ, పిరియామాధవి పాల్గొన్నారు.

ఫపాతశ్రీకాకుళం, మార్చి9(ఆంధ్రజ్యోతి): సోలార్‌ రూప్‌టాప్‌తో పేద,మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా ఉపశమనం కలిగించడమే ఆ పథకం లక్ష్యమని ఎమ్మెల్యే గొండుశంకర్‌ తెలిపారు. సోమవారం పాత్రునివలస ఎస్సీ కాలనీలో నివసిస్తున్న 60 పేదకుటుంబాలకు సూర్యఘర్‌ యోజన పథకం కింద సోలార్‌ రూప్‌టాప్స్‌ను శంకర్‌ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఎస్‌ఈ కృష్ణమూర్తి పాల్గొన్నారు.

ఫశ్రీకాకుళం రూరల్‌, మార్చి9 (ఆంద్రజ్యోతి): కొత్తరోడ్డు జంక్షన్‌ వద్ద జరుగుతున్న బ్రిడ్జి పనులను సోమవారం ఎమ్మెల్యే గొండు శంకర్‌ పరిశీలించారు.

Updated Date - Mar 09 , 2026 | 11:50 PM