దౌర్జన్యంగా పంటను నూర్చేశారు
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:05 AM
నా రెండెక రాల పొలంలో క ష్టపడి పండించిన వరి పంటను తన చిన్నకోడలు సునీత దౌర్జన్యంగా కోసి నూర్చేసి ధాన్యం విక్రయించుకుందని, న్యాయం చేయాలని మంచాలపేట గ్రామానికి చెందిన మంచాల కృష్ణమూర్తి అధికారులను కోరారు.
కోటబొమ్మాళి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): నా రెండెక రాల పొలంలో క ష్టపడి పండించిన వరి పంటను తన చిన్నకోడలు సునీత దౌర్జన్యంగా కోసి నూర్చేసి ధాన్యం విక్రయించుకుందని, న్యాయం చేయాలని మంచాలపేట గ్రామానికి చెందిన మంచాల కృష్ణమూర్తి అధికారులను కోరారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ సహాయకులు హరికి వినతి పత్రం అందజేశారు. తనకు ముగ్గురు కుమారులని, వారిలో మూడో కుమారుడు రమణమూర్తి భార్య సునీత.. ఈ మధ్య కాలంలో భూములు వాటా వేయాలని గొడవచేస్తుందని, ఆ భూమిపై వచ్చే ఫలసా యమే నాకు, నా భార్యకు ఆధారమని, తాము ఉన్నంతవరకు వాటాలు వేయని చెప్పానన్నారు. అయినా సునీత వినకుండా వృద్ధులైన తమపై దౌర్జనం చేసి పలుమార్లు దాడి చేసిందని, అలాగే కొంతమంది గ్రామస్థుల సహకారంతో మా కు తెలియకుండా నేను సాగు చేసిన పొలంలోని వరి పంటను కోసి, ధాన్యాన్ని విక్రయించుకుందని ఆవేనదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మేము ఎలా బతకాలని కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో న్యాయం చేయాలని కృష్ణమూర్తి అధికారులను వేడుకున్నాడు.