Share News

ప్రారంభించారు.. పనులు మరిచారు

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:06 AM

మహాదేవపురంలో మూడు సంవత్సరాల కిం దట పనులు ప్రారంభిం చిన అంగన్‌వాడీ కేంద్రం భవనం పనులు నేటికీ పూర్తి కాలేదు. అధికారు ల పర్యవేక్షణ లేకపోవ డంతో భవనం పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి.

ప్రారంభించారు.. పనులు మరిచారు
సగంలో నిలిచిపోయిన అంగన్‌వాడీ భవనం:

పలాసరూరల్‌, జూన్‌ 27 (ఆఽంధ్రజ్యోతి): మహాదేవపురంలో మూడు సంవత్సరాల కిం దట పనులు ప్రారంభిం చిన అంగన్‌వాడీ కేంద్రం భవనం పనులు నేటికీ పూర్తి కాలేదు. అధికారు ల పర్యవేక్షణ లేకపోవ డంతో భవనం పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాన్ని పాఠశాల భవనం లోనే ఒక గదిలో బిక్కుబిక్కుమని నిర్వహిస్తున్నారు. స్కూల్‌కు వెనుకభాగంలో విశాలమైన గదిని నిర్మించినా దానిని పూర్తి చేయకుండా సగంలోనే నిలుపుదల చేయడంపై విమర్శలొస్తున్నాయి. ఇప్పటికైనా భవన నిర్మాణం పూర్తి చేసి ఆ భవనంలోకి మార్చాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jun 28 , 2026 | 12:06 AM