Share News

హిందువులంటే వారికి చిన్నచూపు

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:11 AM

మాజీ ము ఖ్యమంత్రి జగన్మో హన్‌రెడ్డితో పాటు వైసీపీ నాయకులకు దేవుడంటే భయం, భక్తిలేదని, హిందు వులంటే వారికి లెక్కేలేదని రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ బోయిన గోవిందరాజులు తీవ్రంగా మండిపడ్డారు.

హిందువులంటే వారికి చిన్నచూపు

  • రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ గోవిందరాజులు

కోటబొమ్మాళి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): మాజీ ము ఖ్యమంత్రి జగన్మో హన్‌రెడ్డితో పాటు వైసీపీ నాయకులకు దేవుడంటే భయం, భక్తిలేదని, హిందు వులంటే వారికి లెక్కేలేదని రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ బోయిన గోవిందరాజులు తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం ఆయన స్థానిక ఎన్టీఆర్‌ భవనంలో విలేకరులతో నిర్వహించారు. దేవదేవుడిని కూడా రాజకీయాలకు వా డుకేనే స్థాయికి వైసీపీ నాయకులు దిగారని, జగన్‌ డైరెక్షన్‌లో చెప్పులు, షూలు వేసుకొని కలియుగ దైవం వేంకటేశ్వస్వామి ఫొటోలు పట్టుకొని నినాదాలు చేస్తూ రాజకీయం చేసే నీచానికి దిగారని దుయ్యబట్టారు. జగన్‌రెడ్డికి హిందూమత విశ్వాసాల పట్ల, తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదాయాలు, సంస్కృతిపై చిన్నచూపు ఉందని ఆరోపించారు. పవిత్రమైన దేవుడి ప్రసాదాన్ని జంతుకొవ్వు, ప్రమాదకర రసాయనాలతో కల్తీ చేశారని ఆరోపించారు. శ్రీవారి పరకామణిలో విదేశీ కరెన్సీని కొల్లగొట్టిన కేసులో నిందితుడైన రవికుమార్‌కు అండగా జగన్మోహ న్‌రెడ్డి నిలిచి, ఈ విషయం బయటకు రాకుండా చేశారన్నారు. రామతీర్థంలో రా ములవారి విగ్రహ శిరస్సు ఖండన చేయడం వంటి దాష్టీకానికి ఒడిగట్టడంతో పాటు రాష్ట్రంలో 300 పైగా దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం జరిగా యని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి ఒక్కరోజూ కూడా వెళ్లి పరిశీలించలేదని, హిందువులపై ఆయనకు ఉన్న ద్వేషం ఏంటో చెప్పవచ్చన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్‌.రామకుమార్‌, పాగోటి ముత్తురాజు, మంగి రమణ తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 12:11 AM