Share News

కొలువుదీరారు

ABN , Publish Date - Nov 24 , 2026 | 12:17 AM

Swearing-in of new governing bodies in municipalities ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీల్లో కొత్త పాలకవర్గం కొలువుదీరింది. ఇచ్ఛాపురం మునిసిపాల్టీ ఏడవ పాలక వర్గం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం.. మున్సిపల్‌ ఎన్నికల అధికారి వేణుగోపాల్‌ అధ్యక్షతన సోమవారం ఘనంగా జరిగింది. తొలుత మునిసిపల్‌ చైర్‌పర్సన్‌గా ఆశీ లీలారాణితో ప్రత్యేక అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు.

కొలువుదీరారు
చైర్‌పర్సన్లుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న లీలారాణి (ఇచ్ఛాపురం), గంగాభవాని (పలాస), ఇచ్ఛాపురం మునిసిపాలిటీ వైస్‌చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేస్తున్న జయదేవ్‌

పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసిపాలిటీల్లో కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం

చైర్‌పర్సన్లుగా గంగాభవాని, లీలారాణి

ఇచ్ఛాపురంలో వైస్‌చైర్మన్‌గా జయదేవ్‌

ఇచ్ఛాపురం/ పలాస, నవంబరు 23(ఆంధ్రజ్యోతి) : ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీల్లో కొత్త పాలకవర్గం కొలువుదీరింది. ఇచ్ఛాపురం మునిసిపాల్టీ ఏడవ పాలక వర్గం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం.. మున్సిపల్‌ ఎన్నికల అధికారి వేణుగోపాల్‌ అధ్యక్షతన సోమవారం ఘనంగా జరిగింది. తొలుత మునిసిపల్‌ చైర్‌పర్సన్‌గా ఆశీ లీలారాణితో ప్రత్యేక అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 28వార్డుల కౌన్సిలర్లుతో ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యఅతిథిగా విప్‌, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ హాజరయ్యారు.

పలాస-కాశీబుగ్గ మునిసిపల్‌ చెర్‌పర్సన్‌గా వజ్జ గంగాభవాని ప్రమాణ స్వీకారం చేశారు. పలాస మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారిగా వ్యవహరించిన పలాస ఎంఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సభ్యులతో ప్రమాణం చేయించారు. తొలుత చైర్‌పర్సన్‌ గంగాభవాని.. తర్వాత 36 వార్డుల కౌన్సిలర్లు ప్రమాణం చేశారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభించాల్సిన ఈ కారక్రమం సభ్యుల రాక ఆలస్యం కావడంతో గంటపాటు ఆలస్యమైంది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం చాంబర్‌లోకి అడుగుపెట్టిన చైర్‌పర్సన్‌ గంగాభవాని భావోద్వేగానికి గురికాగా.. ఆమెను ఎమ్మెల్యే శిరీష ఓదార్చారు.

ఏకగ్రీవంగా వైస్‌చైర్మన్‌ ఎన్నిక...

ఇచ్ఛాపురం మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో కూటమి తరపున 24వ వార్డు ఏకగ్రీవ కౌన్సిలర్‌ కాళ్ల జయదేవ్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రత్యేక అధికారి వేణుగోపాల్‌ ప్రకటించి ప్రమాణ స్వీకారం చేయించారు.

Updated Date - Nov 24 , 2026 | 12:17 AM