ప్రాణం పోయిన తర్వాత కన్నం కప్పారు
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:02 AM
సుసరాం తంపర వద్ద ప్రధాన రహదారికి మూడునెలల కిందట ఏర్పడిన కన్నం (రంధ్రం) ఓ మహిళ ప్రాణంపోయిన తర్వాత మొక్కుబడిగా కప్పారని ప్రియాగ్రహారం, సుసరాం గ్రామస్థులు ఆవేన ద వ్యక్తం చేశారు.
ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యంపై మండిపాటు
పోలాకి, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): సుసరాం తంపర వద్ద ప్రధాన రహదారికి మూడునెలల కిందట ఏర్పడిన కన్నం (రంధ్రం) ఓ మహిళ ప్రాణంపోయిన తర్వాత మొక్కుబడిగా కప్పారని ప్రియాగ్రహారం, సుసరాం గ్రామస్థులు ఆవేన ద వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి ఉర్జాం గ్రామానికి చెందిన రోణంకి తేజేశ్వరి ఇదే కన్నం వద్ద తన వాహనం అదుపుతప్పడంతో ప్రాణాన్ని కోల్పోయి, మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారని వారు గుర్తుచేశారు. ఆర్‌అండ్‌బీ రోడ్డులో సుసరాం తంపర వద్ద మూడునెలల కిందట రంధ్రం ఏర్పడిందని, దీనిపై ముళ్లకంపలు, ఎర్రగుడ్డలతో రంధ్రాన్ని నింపారే తప్పా మరమ్మతులు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం పోయిందని, ఇప్పుడు స్పందించిన అధికారులు మంగళవారం తూతూ మంత్రంగా రంధ్రాన్ని కప్పి చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేచోట మళ్లీ రంధ్రం ఏర్పడి ప్రమాదాలు జరగవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంప్నై ఆర్‌అండ్‌బీ ఇంజనీర్‌కు ఫోన్ చేసినా స్పందనలేదని, కార్యాలయానికి వెళ్లినా ఫలితం లేకపోయిందని గ్రామానికి చెందిన ప్రభాకర్ తెలిపారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో పనులు చేపట్టాలని కోరారు.