Share News

అవసరాల కోసం దొంగలుగా మారి..

ABN , Publish Date - Feb 09 , 2026 | 11:42 PM

పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల్లోని రోటరీనగర్‌లో నివాసముంటున్న సునీతపాత్రో ఇంట్లో జరిగిన దొంగత నం కేసును కాశీబుగ్గ పోలీసులు ఛేదించారు. ఈకేసులో అవసరాలకోసం దొంగగా మారి ఆభరణాలను చోరీచేశారు.

అవసరాల కోసం దొంగలుగా మారి..
చోరీ వివరాలు వివరిస్తున్న డీఎస్పీ షేక్‌సహబాజ్‌ అహ్మద్‌, ప్రక్కన సీఐ వై.రామకృష్ణ

పలాస, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల్లోని రోటరీనగర్‌లో నివాసముంటున్న సునీతపాత్రో ఇంట్లో జరిగిన దొంగత నం కేసును కాశీబుగ్గ పోలీసులు ఛేదించారు. ఈకేసులో అవసరాలకోసం దొంగగా మారి ఆభరణాలను చోరీచేశారు. ఈ మేరకు సోమవారం ఇద్దరు నిందితులను అరెస్టుచేయడంతో పాటు వారి నుంచి రూ.7.50 లక్షల విలు వైన ఐదు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నింది తులను కోర్టులో హాజరుపరిచారు. ఈకేసును ఛేదించిన సీఐ వై.రామకృష్ణ, పోలీసు బందాన్ని డీఎస్పీ అభినందించారు.కాశీబుగ్గ డీఎస్పీ షేక్‌సహ బాజ్‌ అహ్మద్‌ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. డీఎస్పీ కథనం మేరకు.. సునీతపాత్రో భర్త రాజుపాత్రోతో కలిసి కాశీబుగ్గ మేదర వీధికి చెందిన తెల్లి దీనబంధు గతంలో విద్యుత్‌ పనులు చేసుకొనేవారు. ఈక్రమంలో ఆయనతో పరిచయం ఏర్పడింది. రాజుపాత్రో తాను పని చేస్తున్నా డబ్బులు సరిపడకపోవడంతో చెన్నైకు ఉపాధి కోసం వెళ్లిపోయా డు. సునీతపాత్రో కేటీరోడ్డులో ఉండే బాటా షోరూమ్‌లో సేల్స్‌గర్లగా పని చేసి పిల్లలతో ఉంటోంది. వీరి ఇంట్లో బంగారు ఆభరణాలు ఉన్న విష యాన్ని గుర్తించిన దీనబంధు వాటిని దొంగిలించి ఆ డబ్బులతో తన అవ సరాలు తీరుతాయని భావించి పథకం వేసుకున్నాడు. స్థానికంగా ఉన్న కేకే ఎంటర్‌ప్రైజెస్‌లో పనిచేస్తున్న ఉదయపురం కాలనీకి చెందిన టెంక నాగరాజుకు బీరువాలు బాగుచేయాలని తన బైక్‌లో ఎక్కించుకొని బయ లుదేరాడు. మార్గమధ్యలో దొంగతనం చేస్తానని, వాటా కూడా ఇస్తానని చెప్పడంతో ఆయన అంగీకరించి సునీతపాత్రో ఇంటి వద్దకు చేరుకున్నారు. అనంతరం బీరువా విరగ్గొట్టి లాకర్‌లో ఉన్న ఐదుతులాల బంగారు ఆభర ణాలు తస్కరించారు. ఈనెల ఏడోతేదీ రాత్రి ఈ సంఘటన జరగ్గా బాధి తురాలు సునీతపాత్రో కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు సీఐ రామకృష్ణ తన బృందంతో పాత నేరస్థులతో పాటు ఆ ప్రాంతంలో తిరిగే అనుమానితులను ప్రశ్నించడంతో వారిచ్చిన సమచారం మేరకు కేసు ఛేదించారు. వారిద్దరి నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసు కున్నారు. వారిని సోమవారం అరెస్టు చేసి పలాస కోర్టులో హాజరుపరి చారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.

Updated Date - Feb 09 , 2026 | 11:42 PM