ఊరు బయటే ఉంటున్నారు
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:20 AM
The flies that never leave Balakavanipet టెక్కలి మండలం బాలకవానిపేట గ్రామస్థులను ఈగల బెడద ఇంకా వదలడం లేదు. ఐదురోజుల నుంచి గ్రామస్థులు ఈగల మోతతో ఇబ్బందులు పడుతున్నారు. నిద్ర లేక.. భోజనం చేయలేక నరకయాతన అనుభవిస్తున్నారు.
బాలకవానిపేటలో వదలని ఈగల బెడద
పట్టించుకోని అధికారులు
టెక్కలి రూరల్, జూలై 11(ఆంధ్రజ్యోతి): టెక్కలి మండలం బాలకవానిపేట గ్రామస్థులను ఈగల బెడద ఇంకా వదలడం లేదు. ఐదురోజుల నుంచి గ్రామస్థులు ఈగల మోతతో ఇబ్బందులు పడుతున్నారు. నిద్ర లేక.. భోజనం చేయలేక నరకయాతన అనుభవిస్తున్నారు. శనివారం సైతం ఈగల బెడదతో ఇళ్లలో ఉండలేక కొంతమంది ఊరుబయటే ఉన్నారు. గ్రామ శివారులో చెట్ల కింద తలదాచుకున్నారు. కొంతమంది బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. పగలు బయట తిరిగినా.. రాత్రివేళ మాత్రం ఇళ్లలో కనీసం నిద్ర పోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మొక్కుబడిగా స్ర్పేయింగ్ చేసి వదిలేశారని, పూర్తిస్థాయిలో ఈగల నివారణకు చర్యలు చేపట్టడం లేదని వాపోతున్నారు. గ్రామ శివారులో కోళ్లఫారాల వ్యర్థాలు కుళ్లి ఈగల బెడద పెరిగిందని ఆరోపిస్తున్నారు. జిల్లాస్థాయి అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.