పాత్రికేయుల రక్షణకు ప్రత్యేక చట్టాలుండాలి
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:33 AM
Demand of journalists' associations పాత్రికేయుల రక్షణకు ప్రత్యేక చట్టాలను ప్రభుత్వం అమలు చేయాలని జర్నలిస్టు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా వి.కోట మండల ‘ఆంధ్రజ్యోతి’ సీనియర్ రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం దారుణంగా హత్యకు గురయ్యారు. ఉదయం వాకింగ్ చేస్తుండగా.. అదే ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ తమీం హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనను నిరసిస్తూ.. మంగళవారం సాయంత్రం శ్రీకాకుళంలో ఏడురోడ్ల జంక్షన్ వద్ద జర్నలిస్టు సంఘాల నాయకులు, సభ్యులు, ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ రిపోర్టర్లు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
జర్నలిస్టుల సంఘాల డిమాండ్
చిత్తూరు జిల్లాలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ దారుణ హత్యకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ
శ్రీకాకుళం అర్బన్, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): పాత్రికేయుల రక్షణకు ప్రత్యేక చట్టాలను ప్రభుత్వం అమలు చేయాలని జర్నలిస్టు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా వి.కోట మండల ‘ఆంధ్రజ్యోతి’ సీనియర్ రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం దారుణంగా హత్యకు గురయ్యారు. ఉదయం వాకింగ్ చేస్తుండగా.. అదే ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ తమీం హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనను నిరసిస్తూ.. మంగళవారం సాయంత్రం శ్రీకాకుళంలో ఏడురోడ్ల జంక్షన్ వద్ద జర్నలిస్టు సంఘాల నాయకులు, సభ్యులు, ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ రిపోర్టర్లు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సీనియర్ రిపోర్టర్ జగన్మోహనరెడ్డి జోహార్.. జోహార్ అంటూ నినాదాలు చేశారు. జర్నలిస్టులను భయపెట్టాలని చూస్తే సమాజానికి అవమానమని.. కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి నిందితుడిపై కఠినచర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధి నల్లి ధర్మారావు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు డోల అప్పన్న, శాసపు జోగినాయుడు, తిత్తి ప్రవీణ్‌కుమార్, ఓంపురి రమేష్, ఎస్.చంద్రశేఖరరావు, డోల శంకరరావు, బీజేపీ నాయకులు పైడి సింధూర, ప్రింట్, ఎలకా్ట్రనిక్ మీడియాకు చెందిన పలువురు రిపోర్టర్లు మద్దతుగా పాల్గొన్నారు.