ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు: ఎస్పీ
ABN , Publish Date - Mar 24 , 2026 | 12:06 AM
: పబ్లిక్ గ్రీవెన్స్‌లో స్వీకరించే ఫిర్యాదుల పరిష్కా రంలో ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయా లని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదే శించారు.
శ్రీకాకుళం క్రైం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): పబ్లిక్ గ్రీవెన్స్‌లో స్వీకరించే ఫిర్యాదుల పరిష్కా రంలో ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయా లని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదే శించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను నిర్వ హించి 55 మంది నుంచి వినతులు స్వీకరిం చారు. బాధితులతో స్వయంగా మాట్లాడి సమస్య లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వీకరించిన అర్జీలు, వివరాలను జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా తక్షణమే సంబం ధిత పోలీస్ అధికారు లకు తెలియజేసి చట్టం ప్రకారం చర్యలు తీసు కొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశిం చారు. చంద్రశేఖర్ అనే వ్యక్తి ఏడు ఏళ్లుగా ప్రేమి స్తున్నానని మాయమాటలు చెప్పి తనను వివా హం చేసుకోకుండా మోసం చేశాడని హిరమం డలం మండలం ఓ గ్రామానికి చెందిన యువతి ఫిర్యాదు చేసింది. శ్రీకాకుళం రూరల్ మండలం పొన్నాం పంచాయతీకి చెందిన కె.దుర్గాప్రసాద్ ఆమదాలవలస హెచ్‌డీఆర్‌సీ బ్యాంకు అకౌంట్‌లో ఉన్న రూ.90 వేలు సైబర్ నేరగాళ్లు కాజేశారని, ఈ విషయమై శ్రీకాకుళం రూరల్ స్టేషన్ లో వారం రోజుల కిందట ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.