Share News

జైళ్లలో కులవివక్ష ఉండకూడదు

ABN , Publish Date - Mar 26 , 2026 | 12:07 AM

జైళ్లలో శిక్ష అనుభవి స్తున్న ఖైదీల మధ్య కుల వివక్షకు తావుండరాదని జిల్లా న్యాయాధి కారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా అన్నారు.

జైళ్లలో కులవివక్ష ఉండకూడదు
జైలు ప్రాంగణంలో అధికారులతో చర్చిస్తున్న జిల్లా న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి

  • జిల్లా న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

శ్రీకాకుళం లీగల్‌, మార్చి 25(ఆంధ్రజ్యోతి): జైళ్లలో శిక్ష అనుభవి స్తున్న ఖైదీల మధ్య కుల వివక్షకు తావుండరాదని జిల్లా న్యాయాధి కారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా అన్నారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి, బోర్డు ఆఫ్‌ విజిటర్స్‌తో కలసి బుధవారం జిల్లా జైలును ఆయన తనిఖీ చేశారు. రిజిస్టర్లు, ఫార్మెట్లను పరిశీలించారు. కులంతో సంబంధం లేకుండా అందరికీ అన్ని సౌక ర్యాలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సరైన న్యాయ ప్రాతినిధ్యం లేని ఖైదీల వివరాలు సేకరించి.. వారికి తక్షణమే బెయిలు దరఖాస్తులు... ఇతర చట్టపరమైన అంశాల్లో ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2026 | 12:07 AM