వైసీపీ నాయకుల ఆరోపణల్లో వాస్తవాలు లేవు
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:44 PM
తమిళనాడులో తప్ప అన్నీ రాష్ట్రాల్లో వ్యవసాయ మార్కెట్‌ల్లో సెస్‌విధానం ఉందని, వైసీపీ నాయకులు పలాస మార్కెటింగ్ కమిటీపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని స్థానిక ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు తెలిపారు.
పలాస, జూన్ 8(ఆంధ్రజ్యోతి): తమిళనాడులో తప్ప అన్నీ రాష్ట్రాల్లో వ్యవసాయ మార్కెట్‌ల్లో సెస్‌విధానం ఉందని, వైసీపీ నాయకులు పలాస మార్కెటింగ్ కమిటీపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని స్థానిక ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం పలాసలో ఏఎంసీ డైరెక్టర్లతో కలిసి విలేకరులతో మాట్లా డుతూ మార్కెటింగ్ కమిటీ చట్టం ప్రకారం ఒక శాతం సెస్ అమలుచేస్తున్నట్లు చెప్పారు. సెస్‌ద్వారా వచ్చిన డబ్బులు ఆయా గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్ర మాలకే వినియోగిస్తున్నట్లు తెలిపారు. కేవలం రాజకీయ దురుద్దేశంతో ఏఎంసీపై అసత్య ప్రచారం చేస్తున్నారని, తప్పుడు ప్రచారం, చట్టాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ హెచ్చరించారు. సమావేశంలో ఏఎంసీ వైస్‌చైర్మన్ ఎన్.చంద్రకళ, డైరెక్టర్లు జె.ఊర్వసి, ఎం.జోగారావు, ఎన్.రామా రావు, కె.వైకుంఠరావు, ఎ.రామకృష్ణ, ఎ.తేజేశ్వరరావు పాల్గొన్నారు.