సమాజ రుగ్మతలపై పోరాటం అవసరం
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:47 PM
సమాజంలో అసమాన తలను కులమతాలకు అతీతంగా ప్రశ్నించాలని, సమాజంలో ఉన్న రుగ్మతలపై పోరాటాలు అవసర మని ఐద్వా పూర్వ రాష్ట్ర కార్యదర్శి డి.రమా దేవి అన్నారు.
ఐద్వా పూర్వ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి
గుజరాతీపేట. మార్చి 14 (ఆంధ్రజ్యోతి): సమాజంలో అసమాన తలను కులమతాలకు అతీతంగా ప్రశ్నించాలని, సమాజంలో ఉన్న రుగ్మతలపై పోరాటాలు అవసర మని ఐద్వా పూర్వ రాష్ట్ర కార్యదర్శి డి.రమా దేవి అన్నారు. స్థానిక అంబేడ్కర్ ఆడిటోరియంలో యూటీ ఎఫ్ జిల్లా స్థాయి మహిళా చైతన్య సదస్సు శనివారం నిర్వహించారు. స్వతంత్ర భావాలు కలిగి ఉండి ప్రశ్నించే తత్వాన్ని సమాజానికి అందించాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన బి.ధనలక్ష్మి మాట్లాడుతూ.. సమాజంలో మహి ళలపై వివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా సావిత్రీబాయి పూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పిం చారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయ కులు పి.మణి, ఎన్. అరుణకుమారి, ఎస్.కిషోర్ కుమార్, ఎల్.బాబూరావు, బి.శ్రీరామ్మూర్తి, బి. మోహన రావు, గొంటి గిరిధర్, ఎం.వాగ్దేవి, చౌదరి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.