Share News

అంబేడ్కర్‌ వర్సిటీలో కొలువుల సందడి!

ABN , Publish Date - May 17 , 2026 | 12:16 AM

Green signal for filling 46 faculty posts ఎచ్చెర్లలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో అధ్యాపక పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. తాజా నివేదిక ప్రకారం అంబేడ్కర్‌ వర్సిటీలో మొత్తం 46 అధ్యాపక పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది.

అంబేడ్కర్‌ వర్సిటీలో కొలువుల సందడి!
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ పరిపాలనా భవనం

  • - 46 అధ్యాపక పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

  • - అత్యధికంగా 30 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఖాళీలు

  • ఎచ్చెర్ల, మే 16(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్లలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో అధ్యాపక పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. తాజా నివేదిక ప్రకారం అంబేడ్కర్‌ వర్సిటీలో మొత్తం 46 అధ్యాపక పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది. ఇందులో ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేటగిరీలకు చెందిన రెగ్యులర్‌ పోస్టుల్లో కొన్ని బ్యాక్‌లాగ్‌ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.

  • పోస్టుల వివరాలు ఇలా-

  • అంబేడ్కర్‌ వర్సిటీకి అత్యధికంగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు మంజూరయ్యాయి. విభాగాల వారీగా ఖాళీలు, రిజర్వేషన్లను ప్రకటించారు. 4 ప్రొఫెసర్‌ పోస్టులను రెగ్యులర్‌ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. వీటిలో ఓసీ- 2, బీసీ ఏ- 1, ఎస్సీ- 1 పోస్టు కేటాయించారు. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 12కుగాను రెగ్యులర్‌ 10, ఎస్సీ బ్యాక్‌లాగ్‌- 2 పోస్టులను కేటాయించారు. ఇందులో ఓసీ- 5, బీసీ ఏ- 1, బీసీ బీ- 1, ఎస్సీ- 2, ఎస్టీ- 1 పోస్టులు కేటాయించారు. బ్యాక్‌లాగ్‌ పోస్టులు- 2 ఎస్సీ అభ్యర్థులకు కేటాయించారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 30 కాగా, ఇందులో 28 రెగ్యులర్‌ పోస్టులు, 2 బ్యాగ్‌లాగ్‌ పోస్టులు భర్తీ కానున్నాయి. రెగ్యులర్‌ పోస్టుల్లో ఓసీ- 12, ఈడబ్ల్యూఎస్‌- 2, బీసీ ఏ- 2, బీసీ బీ- 2, బీసీ సీ- 1, బీసీ డీ- 1, బీసీ ఈ- 1, ఎస్సీ- 5, ఎస్టీ- 2, బ్యాక్‌లాగ్‌ పోస్టులు-2లో బీసీ ఏ -1, ఎస్సీ-1 పోస్టు కేటాయించారు.

  • నిరుద్యోగులకు సువర్ణావకాశం-

  • బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ ఏర్పాటై 18 ఏళ్లు అవుతున్నా, అరకొర రెగ్యులర్‌ బోధనా సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. వర్సిటీలో ఏడుగురు రెగ్యులర్‌ అధ్యాపకులు మాత్రమే ఉండగా, మిగిలిన వారంతా కాంట్రాక్ట్‌, సబ్జెక్ట్‌ కాంట్రాక్ట్‌తోనే నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకేసారి 46 రెగ్యులర్‌ అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పీహెచ్‌డీ, నెట్‌, సెట్‌ అర్హతలు సాధించి ఏళ్ల తరబడి వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల నియామకం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశంగానే భావించాలి. నియామక ప్రక్రియ పూర్తయితే వర్సిటీలో విద్యా ప్రమాణాలు మెరుగుతో పాటు, పరిశోధనకు మరింత ఊతం ఇచ్చినట్టువుతుందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - May 17 , 2026 | 12:16 AM