Share News

నాలుగు నెలలుగా వేతనాల్లేవు..

ABN , Publish Date - Aug 18 , 2026 | 12:05 AM

: పాఠశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్‌ వర్కర్లకు నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వలేదని, దీంతో వారు ఎలా బతికేదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నా యుడు, ఉపాధ్యక్షురాలు కె.నాగ మణి ప్రశ్నించారు.

నాలుగు నెలలుగా వేతనాల్లేవు..
ధర్నా చేస్తున్న పాఠశాలల శానిటేషన్‌ వర్కర్లు

జడ్పీ ఎదుట పాఠశాలల శానిటేషన్‌ వర్కర్ల ధర్నా

శ్రీకాకుళం కలెక్టరేట్‌, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్‌ వర్కర్లకు నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వలేదని, దీంతో వారు ఎలా బతికేదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నా యుడు, ఉపాధ్యక్షురాలు కె.నాగ మణి ప్రశ్నించారు. ఈ మేరకు పాఠశాలల స్వీపర్లతో కలిసి జడ్పీ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాటాడుతూ.. పాఠశాలలు, కళాశాలలను పరిశుభ్రంగా ఉంచే శానిటేషన్‌ వర్కర్లు కేవలం రూ.6 వేల తక్కువ వేతనంతో పనిచేస్తున్నారని, అది కూడా నాలుగు నెలలుగా బకాయిలుండడంతో వారు తీవ్రంగా ఇబ్బందు లు పడుతున్నారన్నారు. 300 మంది విద్యా ర్థులకు ఆయ ఆయాను నియమించారని, దీంతో కార్మికులపై పనిభారం పెరిగిందన్నారు. ప్రతి నెలా 5వ తేదీ లోగా వేతనాలు చెల్లించాలని, గ్లౌజులు, మాస్కులు ఇవ్వాలని, ఈఎస్‌ఐ సౌక ర్యం కల్పించాలని, పెండింగ్‌ జీతాలను తక్షణం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందిం చారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు బి.ఉత్తర, టి.ప్రవీణ, ఎన్‌.పద్మ, డి.చంద్రకళ, బి.స్వాతి, పి.రాజేశ్వరి, టి.హేమ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 18 , 2026 | 12:05 AM