మరుగుదొడ్లు లేవు.. నీటి సౌకర్యం లేదు
ABN , Publish Date - May 21 , 2026 | 11:22 PM
గార ఆర్టీసీ బస్టాండ్‌లో సమస్యలు తిష్ఠవేశాయి. రెండు దశాబ్దాల కిందట నిర్మించిన ఈ బస్టాండ్‌లో కనీ స సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
గార, మే 21 (ఆంధ్రజ్యోతి): గార ఆర్టీసీ బస్టాండ్‌లో సమస్యలు తిష్ఠవేశాయి. రెండు దశాబ్దాల కిందట నిర్మించిన ఈ బస్టాండ్‌లో కనీ స సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. గార నుంచి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు శ్రీకాకుళం తదితర ప్రాం తాల్లోగల ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనులకు వెళ్లి వచ్చే వారు ఇక్కడకు వస్తుంటారు. అయితే బస్టాండ్‌లో కనీసం కూర్చో వడానికి కుర్చీలు లేకపోవడంతో సిమెంట్ దిమ్మలపైనే ప్రయాణికులు వేచి ఉండాల్సివస్తోంది. విద్యుత్ సౌకర్యం కూడా లేకపోవడంతో చీకటి పడితే బస్టాండ్ ఆవరణలో అంధకారం అలముకుంటోంది. మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం లేకపోవడంతో ఇక్కడకు వచ్చే ప్రయా ణికులు అగచాట్లకు గురవుతున్నారు. ఇక్కడ శ్రీకాకుళం పాతబస్టాండ్ నుంచి బందరువానిపేటకు వెళ్లే ప్రయాణికులతో పాటు బూరవెల్లి రోడ్డులో కొమరవానిపేట వెళ్లే ప్రయాణికులు, విద్యార్థులు, వ్యాపారులు కూడా బస్సుల కోసం ఇక్కడ వేచిఉంటున్నారు. బస్టాండ్‌లో కూర్చొవడానికి సిమెంట్ బల్లలు సైతం లేకపోవడంతో చెట్ల కింద నిరీక్షించాల్సి వస్తోంది. రెండు దశాబ్దాల కిందట నిర్మించిన బస్టాండ్ కావడంతో స్తం భాలు కూడా బీటలు వారాయి. గార ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయా ణికులు కూర్చొవడానికి సిమెం ట్ బల్లలు ఏర్పాటుచేయడంతో పాటు విద్యుత్ సౌకర్యం, మం చినీరు, మరుగుదొడ్లు సౌకర్యం కల్పించి అందుబాటులోకి తీసు కు రావాలని పలువురు ప్రయా ణికులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.